YCP Unsatisfied Leaders : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అక్కడ రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయింది. చాలా మంది నేతలు అటు నుంచి ఇటు...ఇటు నుంచి అటు జంప్‌లు చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ(YCP) లో ఇది ఎక్కువగా జరుగుతోంది. దీనికి తోడు ఇన్‌ఛార్జుల నియామకం కూడా పార్టీలో సెగలు పుట్టిస్తోంది. పైగా నిన్నటి సెకండ్ లిస్ట్‌లో చాలా మంది సీటు ఆశించిన వారికి టికెట్లు దక్కలేదు. దీంతో వారందరూ వేరే పార్టీల్లోకి వెళ్ళేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఆల్రెడి మల్లాది విష్ణు(Malladi Vishnu), ఎంపీ విజయసాయిరెడ్డి(MP Vijay Sai Reddy) బావమరిది ద్వారకానాథ్(Dwarakanath) లు పార్టీ మారతారని తెలిసిపోయింది. ఇప్పుడు మరికొందరు అదే బాటలో నడిచేందుకు రెడీగా ఉన్నారు.
Also read:అసోంలో ఘోర ప్రమాదం..14 మంది మృతి
నిన్నటి సెకండ్ లిస్ట్ ప్రకటన తర్వాత సీటు రాని ఎమ్మెల్యేలు, ఎంపీల పరిస్థితి ఏంటన్నది ఉత్కంఠగా మారింది. వేరే పార్టీలోకి వెళ్లేందుకు ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. సీటు ఆశించిన 13 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, ఒక ఎంపీకి అధిష్టానం మొండిచెయ్యి చూపించింది. దీంతో వారందరూ చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఇందులో ఫస్ట్ లిస్ట్‌లో ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు.. సెకండ్ లిస్ట్‌లో 10 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీకి సీట్లు దక్కలేదు.
ఫస్ట్ లిస్ట్‌లో సంతనూతలపాడు ఎమ్మెల్యే TJR సుధాకర్ బాబు,గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిలకు చోటు దక్కలేదు. రెండో లిస్ట్‌లో గోరంట్ల మాధవ్ - హిందూపురం ఎంపీ, గుడివాడ అమర్నాథ్ - అనకాపల్లి ఎమ్మెల్యే, మంత్రి గొల్ల బాబురావు - పాయకరావుపేట ఎమ్మెల్యే, కొండేటి చిట్టిబాబు - పి.గన్నవరం ఎమ్మెల్యే, పెండెం దొరబాబు - పిఠాపురం ఎమ్మెల్యే , జ్యోతుల చంటిబాబు - జగ్గంపేట ఎమ్మెల్యే, పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ - పత్తిపాడు ఎమ్మెల్యే, సిద్దారెడ్డి, కదిరి ఎమ్మెల్యే, చెన్నకేసవరెడ్డి- ఎమ్మిగనూరు ఎమ్మెల్యే, చిట్టి ఫల్గుణ - అరకు ఎమ్మెల్యే, మల్లాది విష్ణు - విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేలకు సీట్లు దక్కలేదు. వీరిలో ఇప్పటికే ఇద్దరు ముగ్గురు పార్టీకి బైబై చెప్పేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు అదే బాటలో మరొకొంత మంది పయనిస్తారని టాక్ చాలా గట్టిగా వినిపిస్తోంది. అదే కనుక జరిగితే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి గట్టి దెబ్బే తగులుతుందని అంటున్నారు.