Movies: విశ్వంభరలో త్రిష డబుల్?

వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా విశ్వంభర. ఇందులో త్రిషను హీరోయిన్‌గా తీసుకున్నారు. ఫాంటసీ మూవీగా రూపొందుతున్న విశ్వంభరలో త్రిష డబుల్ రోల్‌లో యాక్ట్ చేస్తుందనే టాక్ వినిపిస్తోంది.

New Update
Movies: విశ్వంభరలో త్రిష డబుల్?

Vishwambhara Movie: వాల్తేరు వీరయ్య తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి కాస్త గ్యాప్‌ తీసుకుని మొదలు పెట్టిన చిత్రం 'విశ్వంభర'. వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పై మెగా ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు. దానికి తగ్గట్టే ఈ మూవీ మీద చాలా హైప్స్ కూడా ఉన్నాయి.విశ్వంభర షూటింగ్ కూడా మొదలయిపోయింది. సోషియో ఫాంటసీ కాన్సెప్ట్‌ తో సినిమాను రూపొందిస్తున్నారు. చాలా కాలం తర్వాత చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ ఇది.

ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి మరో క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. విశ్వంభర మూవీలో త్రిష హీరోయిస్‌గా నటిస్తోంది. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం త్రిష ఇందులో డబుల్ రోల్‌లో నటిస్తోంది అని చెబుతున్నారు. అంతేకాదు రెండు పాత్రలో మూవీలో చాలా కీలకం అని కూడా చెబుతున్నారు.

చాలా ఏళ్ళ తరువాత చిరంజీవి, త్రిష జంటగా నటిస్తున్నారు. చిరంజీవితో ఒకసారి సినిమా చేయడమంటేనే చాలా గొప్ప. అలాంటిది త్రిష రెండోసారి అవకాశం దక్కించుకుంది. అది కూడా డబుల్ రోల్ అంటే మామూలు విషయం కాదని అంటున్నారు మెగాఫ్యాన్స్. ఇక ఈ సినిమాలో చిరంజీవి, త్రిష తో పాటు సురభి, రమ్య, ఇషా చావ్లా, అశ్రిత కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌ లో ఈ సినిమాను భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ను 2025 సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది.

Also Read:Telangana: పెరిగిన ధరలు ఎఫెక్ట్…మార్కెట్లో విచ్చలవిడిగా నకిలీ అల్లంవెల్లుల్లి పేస్ట్..

Advertisment
తాజా కథనాలు