Andhra Pradesh : ఆర్జీవీ తెర మీద వ్యూహం.. నిజమవుతోందా?

టీడీపీ, జనసేనలకు వ్యతిరేకంగా ఆర్జీవీ తీసిన సినిమా వ్యూహం. ఇందులో చంద్రబాబు, పవన్ కల్యాణ్ క్యారెక్టర్లను ఎలివేట్ చేస్తూ రాసిన చాలా డైలాగులు వైరల్ కూడా అయ్యాయి. అయితే ఇప్పుడు ఆంధ్రలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే ఆర్జీవీ చెప్పినట్టే జరుగుతోందా అని అనిపించకమానదు.

New Update
Andhra Pradesh : ఆర్జీవీ తెర మీద వ్యూహం.. నిజమవుతోందా?

TDP vs Janasena : జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్‌(Pawan Kalyan) ను ఎవరూ వెన్నుపోటు పొడక్కర్లేదు.. ఆతనే ముందు పోటు పొడుచుకుంటాడు. ఆర్జీవీ(RGV) తీసిని వ్యూహం(Vyuham) సినిమాలో ఈ డైలాగ్ చాలా వైరల్ అయింది. అయితే ఆర్జీవీ ఈ మాట ఏ ముహూర్తాన అన్నాడో తెలియదు కానీ అచ్చం అలాగే జరుగుతోందని అంటున్నారు ప్రస్తుత పరిస్థితి చూసి. ఎన్నికల నేపథ్యంలో టీడీపీ(TDP), జనసేన(Janasena) మధ్య వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు చూస్తుంటే... ఆర్జీవీ ఇంత కరెక్ట్‌గా ఎలా ఊహించాడబ్బా అన్న ఆశ్చర్యం కలగకమానదు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు జైల్లో ఉన్నప్పటి నుంచి ఈ రెండు పార్టీలు కలిశాయి. ఉమ్మడిగానే పోటీకి దిగుతున్నాయి. అయితే మొదటి నుంచి టీడీపీ ఆధిక్యం కనబరుస్తూనే ఉంది. సీట్ల విషయంలో కూడా అదే చేసింది. పొత్తులో భాగంగా టీడీపీ తన పార్టీకి 144 సీట్లు కేటాయించుకుంది. జనసేనకు కేవలం 24 మాత్రమే ఇచ్చింది. అసలు ముందు నుంచి జనసేనకు 32 సీట్లు ఇస్తారని టాక్ నడిచింది. కానీ అది కూడా లేకుండా 24 మాత్రమే కేటాయించారు. దీని మీదనే జనసేనలో చాలా అసంతృప్తి చెలరేగింది. అక్కడితో ఆగిందా అంటే అదీ లేదు. ఇప్పుడు ఈ కూటమిలోకి బీజేపీ కూడా వచ్చి చేరింది. దీంతో జనసేన సీట్లు మరో మూడు తగ్గిపోయాయి. బీజేపీకి 10 సీట్లు కేటాయించడంతో జనసేన తన వాటిల్లోంచి మూడింటిని త్యాగం చేయాల్సి వచ్చింది.\

కచ్చితంగా ముందు పోటే..

ఈ సీట్ల కేటాయింపు.. ఇచ్చినవి కూడా తగ్గించేయడం జనసైనికులకు మింగుడు పడడం లేదు. అంతలా తొక్కేస్తుంటే పవన్ కల్యాణ్ ఎందుకు కామ్‌గా ఉంటున్నారనేది వాళ్ళకు అర్ధం కావడం లేదు. దీని గురించి పవన్ కూడా ఎక్కడా , ఏమీ మాట్లాడలేదు. దీంతో ఆర్జీవీ వ్యూహం సినిమాలో చెప్పినట్టు పవన్ తనను తానే నాశనం చేసుకుంటున్నాడా అనే డౌట్ అంతటా వ్యక్తం అవుతోంది. నిజంగానే అతను తనని తానే ముందు పోటు పొడుచుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆర్జీవీ చెప్పిందే జరుగుతోందని కామెంట్స్ చేస్తున్నారు.

పవన్‌ను కావాలనే తొక్కేస్తున్నారా..

టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) గురించి అందరికీ తెలిసిందే. రాజకీయంగా ఆయన పండిపోయాడు. ఎప్పుడు ఎవరిని ఎక్కడ వాడుకోవాలి..ఎక్కడ తొక్కేయాలి అన్న విషయాలు ఆయనకు తెలిసినట్టు మరెవ్వరికీ తెలియదన్నది రాజకీయవర్గాల్లో టాక్. ఇప్పుడు పవన్ కల్యాణ్ విషయంలో కూడా చంద్రబాబు అదే చేస్తున్నారా అనే అనుమానం రాకపోదు. తన తర్వాత తన కొడుకు లోకేష్‌ను ఆంధ్రలో నాయకుడిగా నిలబెట్టుకోవడానికి పవన్ కల్యాణ్‌ను పక్కకు నెట్టేస్తున్నారని వాదన వినిపిస్తోంది. అందుకే జనసేనాని ఎమ్మెల్యేగా పోటీ చేయనివ్వకుండా...ఎంపీగా పోటీ చేసేలా ఒప్పించారని చెబుతున్నారు. కరెక్ట్‌గా ఇదే విషయాన్ని ఆర్జీవీ తన వ్యూహంలో కూడా చెప్పించారు. అందులో ఒక డైలాగ్ ఉంటుంది. పవన్ కల్యాణ్ గెలిచి నాయకుడు అయితే ఇంకెవ్వరూ టీడీపీ వైపు చూడరు..అందుకే అతను ఓడిపోయేట్టు చేయాలని స్వయంగా చంద్రబాబే తన పార్టీ నేతలతో చెబుతున్నట్టు ఆర్జీవీ ఒక సీన్ తీశారు. ఇప్పుడు అదే సీన్ ఇక్కడ కూడా కనిపిస్తోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొత్తానికి టీడీపీ మళ్ళీ అధికారంలోకి రావడానికి చంద్రబాబు పవన్ కల్యాణ్‌ను వాడుకుంటున్నారు కానీ...అతను ఎదగకుండా మాత్రం తొక్కేస్తున్నారని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

Also Read : Breaking: ఎన్టీయార్‌కు భారత రత్న?

Advertisment
తాజా కథనాలు