Ebrahim Raisi : హెలికాప్టర్ ప్రమాదం (Helicopter Accident) లో చిక్కుకుపోయిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అచూకి ఇంకా లభించలేదు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా సంఘటన జరిగిన ప్రాంతానికి రెస్క్యూ బృందాలకు (Rescue Team) చేరుకోవడం కష్టతరం అవుతోందని సమాచారం. మరిన్ని రెస్క్యూ బృందాలు, కొంతమంది పర్వతారోహకులు ఈ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌లో చేరినట్లు అధికారులు తెలిపారు. అక్కడి వాతావరణం చలిగా ఉండటం, దట్టమైన పొగమంచు సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తుందని చెబుతున్నారు. కారణంగానే ఈ హెలికాప్టర్ కూలిపోయి ఉంటుందని, రెస్యూ బృందాలకు కూడా వెతకడం కష్టంగా మారిందని పలు నివేదికలు వెల్లడించాయి.
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతోపాటు మంత్రి హొస్సేన్ అమిరబ్డొల్లాహియాన్‌ల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని అధికారులు భావిస్తున్నారు. అజర్‌బైజాన్‌లో డ్యామ్ ప్రారంభించేందుకు వెళ్లగా ఇబ్రహీం రైసీ, ఇతర సీనియర్ అధికారులతో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ సరిహద్దును సందర్శించి తిరిగి వస్తుండగా వాయువ్య ఇరాన్ (Iran) లోని జోల్ఫాలో కూలిపోయినట్లు తెలుస్తోంది.
Also Read : గంగా నదిలో పడవ బోల్తా ఇద్దరు రైతులు గల్లంతు