Iran Backed Hezbollahs : హామాస్, ఇజ్రాయెల్ (Israel-Hamas) మధ్య మొదలైన యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఇప్పటివరకు కూడా ముగింపు దిశగా వెళ్లే పరిస్థితులు అస్సలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఇరాన్ మద్దతున్న హెజ్‌బొల్లా గ్రూప్.. ఇజ్రాయెల్‌కు హెచ్చరికలు జారీ చేసింది. తమ నుంచి ఇజ్రాయెల్ త్వరలో 'సర్‌ప్రైజ్' అందుకోబోతుందంటూ ఓ వీడియోను విడుదల చేసింది. గత కొన్ని నెలలుగా హమాస్‌కు మద్దతుగా హెజ్‌బొల్లా గ్రూప్ దాడులకు దిగుతున్న సంగతి తెలిసిందే.
Also read: వాట్సాప్‌ను టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్.. కంపెనీపై సంచలన ఆరోపణలు
అయితే తాజాగా హెజ్‌బుల్లా గ్రూప్ ఇలా వీడియోలో ఇజ్రాయెల్‌ను హెచ్చరిస్తూ వీడియో చేయడం దుమారం రేపుతోంది. ఈ మిలిటెంట్ గ్రూప్ ఇజ్రాయెల్‌పై మెరుపు దాడులకు దిగే అవకాశాలున్నాయని పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు సాగిన పోరులో తాము ఏమీ సాధించలేకపోయామని ఇజ్రాయెల్ ఒప్పుకుందని హెజ్‌బొల్లా (Hezbollah) సెక్రటరీ జనరల్ హసన్ నస్రల్లాహ్ తన వీడియో సందేశంలో చెప్పాడు. ఇటీవల ఐరోపా దేశాలు.. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించడం వారికి పెద్ద ఎదురుదెబ్బ అంటూ వ్యాఖ్యానించారు. హమాస్ పోరాటం వల్లే సాధ్యమైందని అన్నారు.
మరోవైపు గాజా, రఫాలో ఇజ్రాయెల్ అంతర్జాతీయ రూల్స్‌ను పాటించడం లేదని కూడా నస్రల్లాహ్ ఆరోపణలు చేశారు. అంతర్జాతీయ కోర్టు (International Court) ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా రఫాలో దాడులకు పాల్పడుతోందన్నారు. ఓ వైపు ప్రపంచ దేశాలు హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఆగిపోవాలని కోరుకున్నప్పటికీ కూడా ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగడం ఆందోళన కలిగిస్తోంది.
Also Read: ముస్లిమేతరులపై పాకిస్తాన్ లో దాడులు.. టెన్షన్ లో ప్రజలు..