ఈ ఏడాది భారత్ క్రికెట్‌లోకి దూసుకొచ్చాడు యువకేరటం శుభమన్ గిల్(Shubman Gill). అటు వన్డే.. ఇటు టెస్టుల్లో సత్తా చాటుతూ టీమిండియాకు ఓపెనర్‌గా అదిరిపోయే ఆరంభాలిచ్చాడు. నిజానికి ఈ ఏడాది ఐపీఎల్(IPL)లోనూ గిల్ ప్రతాపం చూపించాడు. సెంచరీలు బాదాడు. గుజరాత్ టైటాన్స్ ఫైనల్‌కు రావడంలో కీలక పాత్ర పోషించాడు. గిల్ సునామీ ఇన్నింగ్స్‌లతో ప్రత్యర్థులు ఓటమి పాలయ్యాయి. మరో సచిన్, మరో కోహ్లీ అంటూ అభిమానులు ఇప్పటికే గిల్‌కు ప్రిన్స్ అనే ట్యాగ్‌ను ఇచ్చేశారు. రోహిత్, కోహ్లీ కెరీర్ మరో రెండుమూడేళ్ల కంటే ఎక్కువగా ఉండే ఛాన్స్ లేదు. అయితే భవిష్యత్‌లో టీమిండియాకు ఎలాంటీ ఢోకా లేదని గిల్, తిలక్, రింకూ లాంటి వారు చూపిస్తున్నారు. ఇదే సమయంలో ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా గిల్ సెలక్ట్ అయ్యాడు.
ఈ ఏడాది టాప్ ఫామ్:
ఈ ఏడాది 43 మ్యాచ్‌లు ఆడిన గిల్.. 46 ఇన్నింగ్స్‌లలో 49.60 సగటుతో 2,034 పరుగులు చేశాడు. 101 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ కలిగి ఉన్నాడు. ఒక డబుల్ సెంచరీ కూడా బాదాడు. ఈ సంవత్సరం ఏడు సెంచరీలు, తొమ్మిది హాఫ్ సెంచరీలు చేశాడు. ఈ ఏడాది 11 టీ20ల్లో గిల్ 30కి పైగా సగటుతో పరుగులు చేశాడు. ఒక సెంచరీ, ఒక 50తో 304 పరుగులు చేశాడు. అతని అత్యుత్తమ స్కోరు 126.
గుజరాత్ టైటాన్స్‌కు నయా కెప్టెన్:
2022లో ఐపీఎల్‌లోకి తొలిసారి ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ ఆ ఏడాదే కప్ గెలుచుకుంది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో దుమ్మురేపిన గుజరాత్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సగర్వంగా ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఇక ఈ ఏడాది కూడా అదరగొట్టింది. ఫైనల్ వరకు దూసుకొచ్చిన గుజరాత్ తుది మెట్టుపై బోల్తా పడింది. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఫైనల్‌లో పరాజయం పాలైంది. ఇక వచ్చే ఏడాది ఐపీఎల్ కోసం నిన్నటి(నవంబర్ 26)తో ప్లేయర్ల రిటెన్షన్, విడుదల ముగిసింది. గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముంబైకి ట్రేడ్ అయ్యాడు. దీంతో గిల్‌కు వచ్చే ఏడాది కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని యాజమాన్యం డిసైడ్ అయ్యింది.
Also Read: రిటెన్షన్ లిస్టులో ట్విస్టులు.. చివరికి హోం టీంకే వచ్చిన హార్ధిక్
WATCH: