Hardik Pandya: 2006లో వచ్చిన పోకిరి(Pokiri) సినిమా గుర్తింది కదా.. తెలుగు చలనచిత్ర రికార్డులను బద్దలు కొట్టిన సినిమా అది. మహేశ్(Mahesh Babu) కెరీర్‌లో వన్ ఆఫ్ ది బిగెస్ట్ బ్లాక్‌బస్టర్. తెలుగు సినిమాలో ఓ కొత్త ట్రెండ్‌ను కూడా క్రియేట్ చేసిన మూవీ అది. పూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేశ్ యాక్టింగ్ చింపేశాడు. పండుగాడిగా ఎవరు డబ్బులిస్తే వారి వైపు ఫైట్ చేసిన మహేశ్ నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే అది సినిమా.. అందులో మహేశ్ డబ్బులు తీసుకొని పని చేసినా అదంతా పోలీస్ ఆపరేషన్ అని లాస్ట్‌లో ట్విస్ట్ ఉంటుంది. కానీ రియల్ లైఫ్‌లో పండుగాడిని పోలి ఉన్న కేరెక్టర్ ఒకటి ఉంది. అది సినీ ఇండస్ట్రీలో కాదు కానీ... క్రికెట్‌లో..!
గుజరాత్ నుంచి ముంబైకి జంప్:
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకి (Hardik Pandya) లైఫ్ ఇచ్చిన జట్టు ముంబై ఇండియన్స్. చెప్పాలంటే పాండ్యాను ముంబై స్టార్‌ను చేసింది. ఐపీఎల్ ప్రదర్శనతోనే పాండ్యా భారత్ జట్టులోకి ఎంపికయ్యాడు. అతని బ్రదర్ కృనాల్ పాండ్యాని తర్వాత ముంబై జట్టులోకి తీసుకుంది. అయితే 2022కు ముందు ముంబై జట్టు (Mumbai Indians) నుంచి వదిలేశాడు పాండ్యా. అయితే అది తన ఇష్టమే కావొచ్చు కానీ.. అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత ముంబై జట్టును టార్గెట్ చేస్తూ పరోక్ష విమర్శలు చేశాడు. ముంబై కేవలం స్టార్లనే వేలంలో కొంటుందని కామెంట్స్ చేశాడు. అయితే బుమ్రా, పాండ్యా ఎవరో ప్రపంచానికి పరిచయం చేసింది ముంబైనేనని ఫ్యాన్స్ అతనిపై మండిపడ్డారు. రోహిత్ శర్మ సైతం పాండ్యా వ్యాఖ్యలను తప్పు పట్టాడు.
మళ్లీ ముంబైకి ట్రేడ్:
సీన్ కట్ చేస్తే మళ్లీ ముంబైకి ట్రేడ్ అయ్యాడు పాండ్యా. అటు కెప్టెన్‌గా గుజరాత్ పాండ్యాకు కొత్త లైఫ్ ఇచ్చిందని.. అతను దాన్ని ప్రూవ్ కూడా చేసుకున్నాడని గుర్తు చేస్తున్నారు ఫ్యాన్స్. కొత్త పాండ్యాను ప్రపంచానికి చూపించిన గుజరాత్‌ను కేవలం డబ్బుల కోసం వదిలేయడంపై ఫ్యాన్స్ సెటైర్లు పేల్చుతున్నారు. పోకిరి సినిమాలో మహేశ్‌బాబు లాగా ఎవరు డబ్బులు ఇస్తే వారికి పాండ్యా ఆడుతున్నాడని కౌంటర్లు వేస్తున్నారు. నీకు నీతి, నిజాయితీలు లేవా అని పోకిరి సినిమాలో మహేశ్‌ని ఒక అమ్మాయి అడిగినట్లు అడుగుతున్నారు. నిజమే కదా.. అక్కడ పండుగాడు.. ఇక్కడ పాండ్యాగాడు.. దెబ్బకు సినిమా హిట్టు..!
Also Read: రిటెన్షన్ లిస్టులో ట్విస్టులు.. చివరికి హోం టీంకే వచ్చిన హార్ధిక్
WATCH: