Shock To IPL 2024 UAE : ఐపీఎల్ 2024(IPL 2024) మరికొన్ని రోజుల్లో మొదలవనుంది. క్రికెట్(Cricket) సంబరాలు ఈప్పుడే మొదలైపోయాయి. జట్లు అననీ ప్రాక్టీసును మొదలుపెట్టేశాయి. ఇతర దేవాల నుంచి ఆటగాళ్ళు వచ్చేస్తున్నారు... జట్టులో జాయిన్ అవుతున్నారు. మార్చి 22 నుంచి మొదలయ్యే ఈ క్రికెట్ యుద్ధానికి భారతీయులు రెడీ అయిపోతున్నారు. ఆ టైమ్‌కు యువతకు చాలా మందికి పరీక్షలు కూడా అయిపోనుండడంతో...క్రికెట్‌లో మునిగి తేలాలని డిసైడ్ అయ్యారు. చాలామంది క్రికెట్ మ్యాచ్‌లను డైరెక్ట్‌గా చూడ్డానికి టికెట్లను కొనుగోలు కూడా చేసేశారు. అయితే ఇప్పడు వారందరి ఆశల మీద బీసీసీఐ నీళ్ళు చల్లనుంది.
త్వరలోనే లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha Elections) జరగనున్నాయి. ఐపీఎల్ , ఎన్నికలు రెండూ ఒకే సమయంలో జరిగే ఛాన్స్ ఉంది. ఈ రెండింటి డేట్స్ క్లాష్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ఐపీఎల్‌ను యూఈఏకు తరలించాలని బీసీసీఐ భావిస్తోంది. దీనికి సంబంధించి ఆ దేశ ప్రభుత్వంతో మాట్లాడ్డానికి బీసీసీఐ(BCCI) ఉన్నతాధికారులు అక్కడు వెళ్ళారని తెలుస్తోంది. ఇదే కనుక నిజమయితే బారత అభిమానులకు నిరాశ తప్పదు.
సీఈసీ(CEC) ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తుంది. ఆ తర్వాత ఐపీఎల్ 2024 మ్యాచ్‌లను దుబాయ్‌కి తరలించాలా? వద్దా? అనే దానిపై బీసీసీఐ నిర్ణయం తీసుకోనుంది. ఎందుకైనా మంచిదని వీసాల కోసం ప్లేయర్స్ తమ పాస్‌పోర్ట్‌లను ఇవ్వాలని కొన్ని ప్రాంఛైజీలు ఇప్పటికే కోరినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 2014లో కూడా ఎన్నికల కారణంగా అప్పటి ఐసీఎల్ మొదటి మ్యాచ్‌లన్నీ యూఈఏలోనే జరిగాయి. కరోనా టైమ్‌లో రెండేళ్ళు కూడా ఐసీఎల్ అక్కడే నిర్వహించారు. యూఏఈలోని దుబాయ్, అబుదాబి, షార్జాలలో గతంలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. 21 మ్యాచ్‌లతో కూడిన ఐపీఎల్ 2024 తొలి అర్ధభాగం షెడ్యూల్‌ను బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. మిగతా సగం వివరాలు..ఎక్కడ పెడతారో నిర్ణయించాక ప్రకటించనున్నారు.
Also Read : Telangana : కవిత అరెస్ట్… విజయశాంతి సంచలన వ్యాఖ్యలు