iPhones : దేశంలో ఐఫోన్ల తయారీకి బ్రేక్.. పెద్ద రీజనే..

తమిళనాడులో చైన్నైలో భారీ వర్షాలు కురుస్తుండటం వల్ల యాపిల్‌ కంపెనీ అక్కడ తమ ఉత్పత్తులు నిలిపివేసింది. అక్కడ పరిస్థితులు కుదుటపడ్డాక మళ్లీ తమ ఉత్పత్తులు కొనసాగిస్తున్నామని ఆ సంస్థ వర్గాలు తెలిపాయి. వర్షాల ప్రభావానికి చైన్నైలో 12 మంది మృతి చెందారు.

Bumper Offer: 1849 రూపాయలకే ఐఫోన్ 14...ఈ వాలంటైన్స్ మీ భాగస్వామికి గిఫ్ట్ ఇవ్వండి..!!
New Update

Exits iPhone Services : యాపిల్‌ ప్రొడక్ట్స్‌కు ఉన్న క్రేజే వేరు. చాలామంది యాపిల్ (Apple)ఉత్పత్తులు కొనేందుకు ఆసక్తి చూపుతుంటారు. మరికొందరు ఎప్పటికైనా ఒక యాపిల్ ఫొన్, యాపిల్ లాప్‌టాప్ తీసుకోవాలనే డ్రీమ్ కూడా పెట్టుకుంటారు. అయితే ఇటీవల యాపిల్ కంపెనీ ఐఫోన్ (iPhone) ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని చైనా నుంచి ఇండియా మార్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ఇండియా వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీంతో విదేశాల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారు ఇండియా వైపే చూస్తున్నారు. అందుకే యాపిల్ కంపెనీ చెన్నైలోని తైవాన్ కంపెనీ అయిన ఫాక్స్‌కాన్ ద్వారా ఐఫోన్‌లు తయారు చేస్తోంది. కానీ ఇప్పుడు ఐఫోన్ ఉత్పత్తులు నిలిచిపోయాయి.

Also Read: రాజస్థాన్, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో సీఎం రేసులో ఉంది వీరే..

తమళినాడు (Tamil Nadu)లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తాత్కాలికంగా ఉత్పత్తిని నిలిపివేస్తున్నామని యాపిల్ ప్రకటించింది. అయితే ప్రస్తుతం అక్కడ ఇంకా సాధారణ పరిస్థితులు రాకపోవడంతో నిలిపివేత కొనసాగుతుంది. అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలించాక తమ ఉత్పత్తిని తిరిగి ప్రారంభిస్తామని సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలాఉండగా.. ఇండియా ప్రస్తుతం ఐఫోన్ ఉత్పత్తిలో 7 శాతం వాటా కలిగి ఉంది. అయితే 2025 నాటికి 25 శాతానికి పెంచాలని యాపిల్‌ నిర్ణయించినట్లు సమాచారం. ఈ కంపెనీలే దాదాపు 35 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మరోవైపు మిచౌంగ్ తుఫాను ప్రభావానికి చైన్నై నగరంతో పాటు చుట్టు పక్కల జిల్లాలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. భారీ వర్షాల నేపథ్యంలో 12 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్‌ కూడా వరద బాధిత ప్రాంతాలను సందర్శించారు. ప్రస్తుతం అక్కడ ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Also Read: 70 ఏళ్ళుగా వారు దానికి అలవాటు పడిపోయారు, జాగ్రత్త..పీఎం మోడీ పోస్ట్

#telugu-news #national-news #apple #iphone #exits-iphone-services
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe