Andhra Pradesh: విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌.. రేపటి నుంచే ఇంటర్న్‌షిప్‌ ప్రారంభం..

ఏపీలో డిగ్రీ, బీటెక్‌ విద్యార్థులకు దీర్ఘకాలిక ఇంటర్న్‌షిప్‌ ప్రారంభం కానుంది. ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకు సోమవారం నుంచి ఇంటర్న్‌షిప్‌ ప్రారంభం కానుండగా.. డిగ్రీ విద్యార్థులకు వచ్చే నెలలో మొదలవుతుంది. ఈ ఏడాది 3.46 లక్షల మంది ఇది చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Telangana : తెలంగాణ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో మార్పు
New Update

ఆంధ్రప్రదేశ్‌లో డిగ్రీ, బీటెక్‌ విద్యార్థులకు విద్యతో పాటు పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలను అందించడానికి గతేడాది ప్రభుత్వం దీర్ఘకాలిక ఇంటర్న్‌షిప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకు సోమవారం నుంచి ఇంటర్న్‌షిప్‌ ప్రారంభం కానుండగా.. డిగ్రీ విద్యార్థులకు వచ్చే నెలలో మొదలవుతుంది. గత ఏడాది 2.56 మంది ఇంటర్న్‌షిప్‌లు చేశారు. అయితే ఈ ఏడాది 3.46 లక్షల మంది ఇందుకు సిద్ధమవుతున్నారు.

30 వేలకు పైగా

జగన్ సర్కార్‌ 30కి పైగా ప్రపంచ స్థాయి సంస్థల్లో వర్చువల్‌గా.. మరో 30 వేలకు పైగా ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమల ద్వారా ఇంటర్న్‌షిప్ అందిస్తోంది. ఇందుకోసం ఉన్నత విద్యా మండలి పోర్టల్‌లో లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఎల్‌ఎంఎస్) ను ఏర్పాటు చేశారు. జిల్లాల వారీగా గుర్తించిన సంస్థల వివరాలను వెబ్‌సైట్‌లో అప్‌డేట్‌ చేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ఉండే ఆ సంస్థలతో సమన్వయం చేసేందుకు ఆయా జిల్లా కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్‌ల ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రత్యేక కమిటీలను నియమించింది.

విద్యార్థుల ఇంటర్‌షిఫ్‌ కోసం.. పరిశ్రమలు, ఐటీ సంస్థలతో పాటు కోర్సులతో సంబంధం ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా, మెగా సంస్థలను కూడా సర్కార్ ఎంపిక చేసింది. ఇందులో మ్యానుఫాక్చరింగ్‌తో పాటు సర్వీసు సంస్థలు కూడా ఉన్నాయి. ఇందుకు సంబంధించి ఉన్నత విద్యా మండలి.. జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందం చేసుకుంటోంది. అంతేకాదు ఎల్‌ఎంఎస్‌ - ఐఐసీ పోర్టల్‌లో వీటి వివరాలు ఉంచింది. గూగుల్, ఐబీఎం, మైక్రోసాఫ్ట్‌, సిస్కో వంటి సంస్థల ద్వారా ఇంటర్న్‌షిప్ అందిస్తోంది.

నెలకు రూ.12 వేలు

అయితే ఈ ఏడాది దాదాపు 40 వేల మంది సంప్రదాయ డిగ్రీ విద్యార్థులకు ఉపకార వేతనంతో కూడిన ఇంటర్న్‌షిప్‌ను అందిస్తోంది. అలాగే రెండు వేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్‌పర్ట్స్‌ కింద సేవలు వినియోగించుకోనుంది. వీరికి నెలకు రూ.12 వేల చొప్పున చెల్లిస్తూ 6 నెలల పాటు విద్యార్థులకు , ఉపాధ్యాయులకు డిజిటల్‌ టెక్నాలజీపై అవగాహన కల్పించనుంది.

చదువుకునేటప్పుడే వేతనం

ఇక విద్యార్థులు తమ స్కిల్స్ పెంపొందించుకునేందుకు డిగ్రీతో పాటు ఇంజనీరింగ్ తదితర ప్రొఫెషనల్‌ కోర్సులకు సంవత్సర కాలం పాటు ఇంటర్న్‌షిప్‌లు అమలు చేయనున్నారు. అయితే ఈ దీర్ఘకాలిక ఇంటర్న్‌షిప్‌లను లాస్ట్ సెమిస్టర్‌లో పెట్టడంతో క్లాస్‌ రూంలో నేర్చుకున్న పాఠ్యాంశాలతో సహా పరిశ్రమల్లో నేర్చుకున్న విజ్ఞానంతో వేగంగా ఉద్యోగాలను సాధిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటిదాకా 10 లక్షల మందికి షార్ట్‌ టర్మ్‌, లాంగ్‌ టర్మ్‌ ఇంటర్న్‌షిప్‌ సౌకర్యం కల్పించింది. దీంతో విద్యార్థులు చదువుకునే సమయంలోనే శాలరీని అందుకోనున్నారు.

#andhra-pradesh #students #engineering-students #degree-students #internship
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe