World War II: హాంగ్ కాంగ్‌లో 450 కేజీల బాంబు.. ఇది అమెరికా పనే!

హాంగ్ కాంగ్‌లో భారీ పరిమాణంలో ఉన్న రెండవ ప్రపంచ యుద్ధం నాటి బాంబు ఒకటి బయటపడింది. నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ఈ బాంబును గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ బాంబును నిర్వీర్యం చేసేందుకు భద్రతా దళాలు వెంటనే రంగంలోకి దిగాయి.

New Update
Hong Kong

హాంగ్ కాంగ్‌(Hong Kong) లో భారీ పరిమాణంలో ఉన్న రెండవ ప్రపంచ యుద్ధం(World War II) నాటి బాంబు ఒకటి బయటపడింది. నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ఈ బాంబును గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ బాంబును నిర్వీర్యం చేసేందుకు భద్రతా దళాలు వెంటనే రంగంలోకి దిగాయి. ఆయా పరిసర ప్రాంతాల్లో 6,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Also Read :  అమెరికాలో H-1B వీసా ఫీజు పెంపుతో.. అష్టకష్టాలు పడనున్న భారతీయులు!

World War II American Bomb In Hong Kong

ఈ బాంబు దాదాపు 450 కిలోగ్రాముల బరువు, 1.5 మీటర్ల పొడవు కలిగి ఉంది. ఈ బాంబు అమెరికా(America) కు చెందినదిగా పోలీసులు నిర్ధారించారు. నిర్మాణ కార్మికులు దీనిని కనుగొనగానే, వెంటనే బాంబు డిస్పోజల్ బృందానికి సమాచారం అందించారు. డిస్పోజల్ టీం బాంబును నిర్వీర్యం చేసేందుకు శుక్ర‌వారం రాత్రి ఆపరేషన్ ప్రారంభించారు. శ‌నివారం ఉద‌యం 11.30 నిమిషాలకు బాంబ్ డిస్పోజల్ చేశారు. ఈ ఆప‌రేష‌న్‌లో ఎవ‌రూ గాయ‌ప‌డ‌లేదు. హాంగ్‌కాంగ్‌లో రెండో ప్ర‌పంచ యుద్ధం కాలం నాటి బాంబులు తరుచూ బ‌య‌ట‌ప‌డుతూనే ఉన్నాయి. 

గతంలో 2018లో కూడా ఇదే తరహా బాంబును వాన్ చాయ్ జిల్లాలో కనుగొన్నట్లు అధికారులు గుర్తు చేశారు. ఆ సమయంలో 1,200 మందిని తరలించి బాంబును నిర్వీర్యం చేశారు.

Also Read :  వెంటనే US వచ్చేయండి.. H1-B, H4 వీసా ఉన్న ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ పిలుపు!

Advertisment
తాజా కథనాలు