/rtv/media/media_files/2025/07/14/womens-makeup-wasting-time-2025-07-14-21-47-58.jpg)
Women's Makeup Wasting Time
మేకప్ అంటే మహిళలకు ప్రాణం. బయటకు వెళ్లాలంటే గంటల తరబడి రెడీ అవుతుంటారు. ఎన్ని పనులు ఉన్నా కూడా అందంగా కనిపించాలని గంటల తరబడి సమయం వేస్ట్ చేస్తారు. చాలా మంది మహిళలు మేకప్ కోసం సమయం వృథా చేస్తారని పురుషులు అంటుంటారు. అయితే ఓ అధ్యయనం ప్రకారం స్త్రీలు ప్రతిరోజూ రెడీ అవ్వడానికి సగటున 60 నిమిషాలు కేటాయిస్తున్నట్లు తేలింది.
ఇది కూడా చూడండి:Vivo X200 FE: అబ్బా తమ్ముడూ.. Vivo నుంచి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్.. కెమెరా సూపరెహే!
సగటున మహిళ రెడీ కావడానికి..
ఇందులో స్నానం చేయడం, జుట్టు సరిచేసుకోవడం, మేకప్ వేసుకోవడం, దుస్తులు ఎంచుకోవడం వంటివి ఉంటాయి. ఒక సంవత్సరంలో సగటు మహిళ రెడీ అవ్వడానికి కేటాయించే సమయం సుమారు 365 గంటలు. అంటే ఇది సుమారు 15 రోజులకు సమానం. ఒక మహిళ 60 సంవత్సరాల వయోజన జీవితంలో (అంటే వయోజనులైన తర్వాత 60 సంవత్సరాలు) రెడీ అవ్వడానికి కేటాయించే మొత్తం సమయం 912 రోజులు. అంటే దాదాపు 2.5 సంవత్సరాలు. అయితే జుట్టు ఆరబెట్టడం, మేకప్ సరిచూసుకోవడం, నప్పే దుస్తులు ఎంచుకోవడం వంటివి చిన్న పనులుగా అనిపించవచ్చు.
ఇది కూడా చూడండి:BIG BREAKING: తుంగతుర్తిలో హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే కిశోర్ తో పాటు బీఆర్ఎస్ కీలక నేతల అరెస్ట్!
కానీ, ఇవి మహిళల జీవితంలో చాలా ముఖ్యమైన సమయాన్ని తీసుకుంటాయని అధ్యయనం స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ పనులు వారి ఆనందానికి, ఆరోగ్యానికి, మానసిక వికాసానికి, వ్యక్తిగత గుర్తింపునకు చాలా సహాయపడతాయి. కాబట్టి, రెడీ అవ్వడం అనేది కేవలం అందంగా కనిపించడం కోసమే కాదు, అది మహిళల మానసిక, శారీరక శ్రేయస్సు లో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది సమయం వృథా కాదని, వారి ఆత్మగౌరవాన్ని పెంచే ముఖ్యమైన భాగమని ఈ అధ్యయనం నిరూపించింది.
ఇది కూడా చూడండి:Axiom-4 mission: ISS నుంచి శుభాంశు శుక్లా తెస్తున్న 263కేజీల నిధి.. ఏంటో తెలిస్తే షాక్!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.