Iran Vs Israel:
ఇట్స్ ఆల్ మోస్ట్ టైమ్..భగవంతుని శిక్ష దగ్గర పడింది అంటూ ఇరాన్ ఆర్మీ పోస్ట్‌లు పెట్టింది. ఇజ్రాయెల్ ను అరికట్టడానికి సమయం ఆసన్నమైందని..ఓ డేగ మాదిరిగా ఇజ్రాయెల్‌ను కమ్మేస్తామని అంటోంది. త్వరలోనే ఇజ్రాయెల్ మీ దాడులు చేస్తామని హెచ్చరించింది. ఈసార దెబ్బ గట్టిగానే పడుతుందని చెపుతూ ఎక్స్‌లో వరుస పోస్ట్‌లు పెడుతోంది ఇరాన్ ఆర్మీ. మిసైల్ లాంచ్‌కు టైమ్ దగ్గరపడిందనే అర్థం వచ్చేలా ప్రోమోలు కూడా వదులుతోంది. ది పనిష్‌మెంట్ టైమ్ ఈజ్ నియర్ అంటు ఇరాన్ ఆర్మీ.ఇజ్రాయెల్‌ను హెచ్చరించింది.
Also Read: Stock Market: రెండు రోజుల ముచ్చటే..మళ్ళీ నష్టాల్లోకి మార్కెట్
Also read: కొండగట్టులో అఘోరీ.. రేపే ఆత్మార్పణ !
కనబడుతున్న సంకేతాలను బట్టి ఇరాన్, జిరాయెల్ మధ్య యుద్ధం తప్పేలా కనిపించడం లేదు. రెండు దేశాలు తగ్గేదేలా అన్నట్టు ప్రవర్తిస్తున్నాయి. ఇప్పటివరకు చిన్న చిన్న అటక్‌లతో కవ్వించుకుంటున్న ఇరాన్, ఇజ్రాయెల్...ఇప్పుడు భారీ దాడులకు సన్నద్ధమవుతున్నాయి. నిన్ననే ఇరాన్‌పై మరో అటాక్ చేయాలని ఇజ్రాయెల్ వార్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దానికి ప్రతిగా ఈరోజు ఇరాన్ కూడాస్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చింది. తమ భూభాగంపై ఒక్క బాంబ్ పడినా...ఇజ్రాయెల్ కలలో కూడా ఊహించని విధంగా విరుచుకుపడుతామని వార్నింగ్ ఇచ్చింది. దీంతో పశ్చిమాసియాలో ఒక్కసారిగా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్, ఇరాన్ ఇద్దరిలో మొదట ఎవరు అటాక్ చేసిన యుద్ధం తప్పదనే ఆందోళనలు కనిపిస్తున్నాయి.
ఇజ్రాయెల్, ఇరాన్ నేరుగా తలపడితే రణరంగమే అంటున్నాయి ప్రపంచ దేశాలు. ఎవరు ఎంత చర్చలు చేసినా రెండు దేశాలు వెనకడుగు వేయడం లేదు. ఎవరు ఎవరి మీద మొదట అటాక్ చేసినా...యుద్ధమే అని కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. అయితే ఈ వార్ ఎక్కడ మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందోనని మిగతా దేశాలు, అరబ్ కంట్రీస్ టెన్షన్ పడుతున్నాయి. ఇప్పటికే ఇరాన్‌కు ఇస్లామిక్ దేశాలు మద్దుతు ప్రకటించాయి. ఇజ్రాయెల్ వైపు అమెరికా ఉండనే ఉంది.