Stock Market: రెండు రోజుల ముచ్చటే..మళ్ళీ నష్టాల్లోకి మార్కెట్ స్టాక్ మార్కెట్ లాభాలకు మళ్ళీ బ్రేక్ పడింది.నిన్న,మొన్న కాస్త కంటపడిన లాభాలు ఈరోజు మళ్ళీ మొహం చాటేశాయి.సెన్సెక్స్ 426 పాయింట్లు నష్టపోయి 79, 942 దగ్గర .. నిఫ్టీ 126 పాయింట్లు నష్టపోయి 24, 340 దగ్గర ముగిసింది. By Manogna alamuru 30 Oct 2024 in బిజినెస్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Stock Market: వచ్చాయి...వచ్చాయి అనుకునే లోపునే దిగజారుతున్నాయి. దేశీ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో దోబూచులాడుతున్నాయి. ఈ నెల అంతా దాదాపు నష్టాల్లోనే నడిచింది మార్కెట్. రెండు రోజులు వరుసగా లాభాలు వచ్చాయి..హమ్మయ్య మార్కెట్ పరిస్థితి మారింది అనుకున్నారు అందరూ. అంతలోనే మళ్ళీ నష్టాలు దూసుకొచ్చేశాయి. అక్షయ తృతీయ అయినా...దీపావళి ముందు రోజు అయినా సరే మార్కెట్ మాత్రం లాభాల్లోకి రాలేకపోయింది. ఈరోజు సెన్సెక్స్ 426 పాయింట్లు పతనమై 79,942 వద్ద ముగిసింది. ఇదే సమయంలో నిఫ్టీ 126 పాయింట్లు పతనమై 24,340 వద్ద ముగిసింది రోజు ముగిసేసరికి 30 సెన్సెక్స్ స్టాక్‌లలో, 19 క్షీణించగా, 11 పెరిగాయి. నిఫ్టీలోని 50 స్టాక్స్‌లో 31 స్టాక్స్ క్షీణించగా, 19 స్టాక్స్ పెరిగాయి. ఎన్‌ఎస్‌ఈ సెక్టోరల్ ఇండెక్స్‌లో ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు ఫార్మా షేర్లలో అతిపెద్ద క్షీణత ఉంది. ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు 1.45% పడిపోయాయి. కాగా, ఫార్మా షేర్లు 1 శాతం పడిపోయాయి. Also read: కొండగట్టులో అఘోరీ.. రేపే ఆత్మార్పణ ! Also Read: తొలిసారిగా మహిళా వ్యోమగామిని అంతక్షంలోకి పంపిన చైనా.. నిన్న లాభాలను చూపించిన బ్యాంకింగ్ షేర్లు...ఈరోజు మాత్రం నష్టాల్లోకి దిగజార్చాయి. బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు మార్కెట్ పతనానికి కారణమయ్యాయి. ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎంఅండ్‌ఎం, కోటక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎంఅండ్‌ఎం, కోటక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. దాంతో పాటూ అంతర్జాతీయ మిశ్రమ సంకేతాలు కూడా డౌన్ ట్రెండ్‌కు కారణమయ్యాయి. ఆసియా మార్కెట్‌లో జపాన్‌కు చెందిన నిక్కీ 0.96 శాతం లాభపడింది. కొరియాకు చెందిన కోస్పి 0.92%, చైనా షాంఘై కాంపోజిట్ 0.61% పతనంతో ముగిశాయి. Also Read: రేవంత్ సర్కార్‌కు బిగ్ షాక్.. కులగణనకు బ్రేక్ Also Read: లారెన్స్ బిష్ణోయ్ హత్యకు ప్లాన్ వేస్తున్న మరో గ్యాంగ్ మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి