/rtv/media/media_files/2025/09/22/bagram-air-base-2025-09-22-15-19-02.jpg)
Why Trump has again demanded control over Afghanistan’s Bagram air base
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం అయిన ట్రూత్ సోషల్‌లో సంచలన పోస్ట్ చేశారు. అఫ్గానిస్థాన్‌లోని బగ్రామ్ ఎయిర్‌బేస్‌కు సంబంధించిన వివాదం గురించి రాసుకొచ్చారు. అఫ్గానిస్థాన్ బగ్రామ్ ఎయిర్‌బేస్‌ను తమకు అప్పగించకుంటే విధ్వంసకర పరిస్థితులు చోటుచేసుకుంటాయని హెచ్చరించారు. ఇటీవల ట్రంప్ యూకే పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ కూడా బగ్రామ్ ఎయిర్‌బేస్ గురించి ప్రస్తావించారు. మరోవైపు తాలిబాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖలోని జాఖీర్ జలాలే అనే అధికారి దీనిగురించి మాట్లాడారు. అఫ్గానిస్థానీయులు ఎప్పుడూ కూడా మిలటరీ ఉండటాన్ని అంగీకరించలేదని తెలిపారు. అలాగే అమెరికా, అఫ్గానిస్థాన్ మధ్య ప్రస్తుతం ఎలాంటి దౌత్యపరమైన సంబంధాలు లేవని పేర్కొన్నారు.
Trump wants Bagram Air Base in Afghanistan back under US control as it is close to China’s nuclear weapons production sites...
— Glenn Diesen (@Glenn_Diesen) September 18, 2025
- Imagine the uproar if China spoke in this manner pic.twitter.com/j7fZsc8XJm
బాగ్రామ్ ఎయిర్‌బేస్‌ను ఎవరు స్థాపించారు ?
అఫ్గానిస్థాన్‌లో బాగ్రామ్ ఎయిర్‌బేస్ అనేది పర్వాన్ ప్రావిన్స్‌లో ఉత్తర కాబుల్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే ఈ ఎయిర్‌బేస్‌ను 1950లో సోవియట్ యూనియన్ నిర్మించింది. ఆ సమయంలో అమెరికా, అలాగే యూఎస్‌ఎస్‌ఆర్ అఫ్గానిస్థాన్‌లో తమ బలాన్ని చూపించేందుకు పోటీ పడ్డాయి. 1979-89 మధ్య సోవియట్-అఫ్గానిస్థాన్ యుద్ధం జరిగినప్పడు బాగ్రామ్ ఎయిర్‌బేస్ సోవియట్‌కు కీలకంగా మారింది. అయితే 1990లో సోవియట్ యూనియన్ ఇక్కడి నుంచి వెళ్లిపోయన తర్వాత బాగ్రామ్ ఎయిర్‌బేస్ అనేది తాలిబన్, నార్తర్న్ అలియన్స్ ఫైటర్స్ యుద్ధం మధ్య ఫ్రంట్‌లైన్‌గా మారింది.
2001, సెప్టెంబర్ 11 తర్వాత అమెరికా, దాని మిత్రపక్షాలు తాలిబన్ పాలనను కూల్చేసి అఫ్గానిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్నాయి. దాదాపు రెండు దశాబ్దాల పాటు అమెరికా బలగాలు అక్కడ స్థావరాలను ఏర్పాటు చేశాయి. ముఖ్యంగా బాగ్రామ్ ఎయిర్‌బేస్ అమెరికన్ల ఉనికికి కీలకంగా మారింది. ఈ ఎయిర్‌బేస్‌ను 77 కిలోమీటర్ల వరకు విస్తరించింది. అక్కడ అమెరికన్ సిబ్బంది కోసం రన్‌వేను నిర్మించారు. అలాగై వైద్య సదుపాయాలు, ఫాస్ట్‌ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేశారు.
ట్రంప్ మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా ప్రభుత్వం 2020లో తాలిబన్‌తో కీలక ఒప్పందం చేసుకుంది. ఫలితంగా దాదాపు 20 ఏళ్ల తర్వాత అఫ్గాన్‌లో అమెరికాతో పాటు నాటో బలగాలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఆ తర్వాత 2021లో తాలిబన్లు అఫ్గాన్‌లో కొనసాగుతున్న ప్రభుత్వాన్ని పడగొట్టి ఆ దేశాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్నాయి. బాగ్రామ్ ఎయిర్‌బేస్ కూడా వాళ్ల ఆధినంలోకి వెళ్లిపోయింది.
అమెరికా ఆందోళన
ప్రస్తుతం బాగ్రామ్ ఎయిర్‌బేస్ తాలిబాన్ కంట్రోల్‌లోనే ఉంది. అయితే చైనా అఫ్గానిస్థాన్‌కు రోడ్ వేసే పనిలో ఉండటంతో అమెరికా ఆందోళన చెందుతోంది. ట్రంప్ కూడా దీనిపై అనేకసార్లు వాదనలు చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా న్యూక్లియర్ ఆయుధాలు తయారుచేసే చోటునుంచి బాగ్రామ్ ఎయిర్‌బేస్‌కు గంట ప్రయాణ దూరంలో ఉందని అన్నారు. కానీ బైడెన్ ప్రభుత్వం బాగ్రామ్‌ను వదలుకుందని విమర్శించారు. అయితే ట్రంప్ చైనాకి సంబంధించి ఏ న్యూక్లియర్ స్థావరాన్ని ప్రస్తావించారనేదానిపై క్లారిటీ లేదు. ఈ ఏడాది మార్చిలో ట్రంప్ బాగ్రామ్ ఎయిర్‌బేస్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
దీన్ని తాలిబన్లు తీవ్రంగా ఖండించారు. బాగ్రామ్ తాబిబన్ల నియంత్రణలోనే ఉందని చైనా కంట్రోల్‌లో లేదని స్పష్టం చేసింది. అలాగే చైనా బలగాలు కూడా ఇక్కడ ఏమీ లేవని.. ఆ దేశంతో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పాయి. ట్రంప్ వ్యాఖ్యల తర్వాత చైనా విదేశాంగ ప్రతినిధి కూడా దీనిపై స్పందించారు. తాము అఫ్గానిస్థాన్ సార్వభౌమత్వాన్ని గౌరవిస్తామని.. ఆ దేశం తన భవిష్యత్తు కోసం తీసుకునే నిర్ణయాలకు మద్దతిస్తామని స్పష్టం చేశారు.