USA: విదేశీ ఉద్యోగులపై సెనేటర్ల ప్రశ్నలు..టీసీఎస్ కు లేఖ

హెచ్ 1బీ వీసాలపై అమెరికా చాలా పట్టుదలగా ఉంది. ముందే చెప్పినట్టుగా అక్కడ ఉన్న కంపెనీలకు సెనేటర్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. తాజాగా ఎందుకు విదేశీ ఉద్యోగులను నియమించుకున్నారు అంటూ టీసీఎస్ కు లేఖ రాశారు. 

New Update
TCS

TCS

హెచ్ 1బీ వీసాలపై తగ్గేదేల లేదు అంటోంది ట్రంప్ ప్రభుత్వం. చాలా పట్టుదలగా కంపెనీలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా టెక్ దిగ్గజాల్లో ఒకటైన టీసీఎస్ పై సెనేటర్లు విరుచుకుపడ్డారు. అమెరికాలో ఆసంస్థ అనుసరిస్తున్న నియామకాల మీద ఆరా తీశారు. ఇక్కడ ఉన్న ఉద్యోగాలఉ అన్నీ హెచ్ 1బీ వీసాదారులతో భర్తీ చేశారా? ఒక వేళ అలా చేస్తే వారికి ఎంత చెల్లిస్తున్నారు? అదే సమయంలో యూఎస్ ఉద్యోగులకు ఎంత జీతం ఇస్తున్నారు లాంటి ప్రశ్నలతో సెనేటర్లు టీసీఎస్ కు లేఖ రాశారు. దీనిపై అక్టోబర్ 10 లోపు స్పందించాలని అడిగారు.

ప్రశ్నల ర్షం కురిపించిన సెనేటర్లు..

రీసెంట్ గా టీసీఎస్ 12వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఇందులో కొందరు యూఎస్ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఒక్క జాక్సన్‌విల్లేలోని కార్యాలయంలోనే సుమారు 60 మంది ఉద్యోగులను ఇటీవల టీసీఎస్‌ తొలగించింది. అయితే టీసీఎస్ మరోవైపు హెచ్ 1బీ వీసాలకు దరఖాస్తు చేస్తోంది. దీనిపైనే సెనేటర్లు దృష్టి పెట్టారు. ఉద్యోగులను తీసేస్తూ కొత్త వీసాలకు ఎందుకు అప్లై చేస్తున్నారంటూ టీసీఎస్ ను ప్రశ్నించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 5,505 హెచ్‌-1బీ వీసాదారులను నియమించుకునేందుకు ఆమోదం కంపెనీ పొందిందని గుర్తు చేశారు. అమెరికాలో ఎవరూ పని చేయడానికి దొరకలేదంటే నమ్మలేకపోతున్నాం అని కామెంట్ చేశారు. 

అమెరికన్ ఉద్యోగుల స్థానంలో హెచ్ 1బీ ఉద్యోగులను తీసుకొస్తున్నారా అని చాలా గట్టిగా సెనేటర్లు టీసీఎస్ ను అడిగారు. సాధారణ నియామక ప్రకటనల నుంచి H-1B నియామక ప్రకటనలను దాచిపెడుతున్నారా? అమెరికన్ వర్కర్లకు చెల్లించే వేతనాన్నే విదేశీ ఉద్యోగులకు కూడా చెల్లిస్తున్నారా అని ప్రశ్నించారు. ఆమోదం పొందిన వీసాల్లో ఎంతమంది ఔట్‌సోర్సింగ్‌ కింద ఇతర కంపెనీల్లో పనిచేస్తున్నారు? వంటి 9 ప్రశ్నలను సంధించారు. అన్నింటికీ అక్టోబర్ 10లోగా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై టీసీఎస్ అధికారికంగా ఎలాంటి ప్రకటనా ఇవ్వలేదు. 

Also Read: Kerala: చొక్కా పట్టుకుని..నడి రోడ్డు మీద..ఎమ్మెల్యేకు చేదు అనుభవం

Advertisment
తాజా కథనాలు