అమెరికాలో ఎన్నికలకు ఒక క్యాలెండర్ ఉంటుంది. ఆ క్యాలెండర్ ప్రకారం వారు ఎన్నికలు నిర్వహిస్తారు. నవంబర్ ఫస్ట్ వీక్ లోని కేవలం మంగళవారం ఓట్లు వేస్తారు. ప్రతి ఎన్నికల్లో ఇదే జరుగుతుంది. ఇక ఈ ఏడాది 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలు సైతం మంగళవారం (నవంబర్ 5)న జరగనున్నాయి.
Also Read: తిరుపతిలో దారుణం...మూడున్నరేళ్ల చిన్నారి పై అత్యాచారం..ఆపై చంపి..!
అయితే నవంబర్ ఫస్ట్ వీక్ లోని మంగళవారమే ఎందుకు? అనే డౌట్ మీకు రావొచ్చు. దానికీ ఓ బలమైన చారిత్రక నేపథ్యం ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1845లో ప్రత్యేక చట్టం
Also read: లెబనాన్ పై విరుచుకుపడిన ఇజ్రాయెల్...కూలిన భారీ భవనాలు!
ఎన్నికల ప్రారంభంలో రాష్ట్రాలకు వేర్వేరు రోజుల్లో ఎన్నికలు జరిగేవి. ఇలా జరగడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశం మొత్తం ఒకేసారి ఎన్నికల్లో పాల్గొనాలని 1845లో ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చారు. ఇందులో భాగంగానే మంగళవారమే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
మంగళవారమే ఎందుకు?
Also Read: కోదాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం...30 మంది!
అప్పటి రోజుల్లో అమెరికా జనాభాలో ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారు. నవంబర్ నెల ఆరంభంలో పండించిన పంట నూర్చి ఖాళీగా ఉండేవారు. ఆ సమయంలో ఓటు వేసేందుకు సరైన సమయం అని భావించారు. అంతేకాకుండా ప్రయాణాలు చేసేందుకు కూడా నవంబర్ నెల అనుకూలంగా ఉంటుంది.
Also Read: నవంబర్ లో బ్యాంకులకు 12 రోజులు సెలవులు!
ఇవన్నీ ఒకెత్తయితే.. క్రైస్తవులు ఎక్కువగా ఆదివారం ఆరాధన దినంగా భావించేవారు. ఇక బుధవారం తమ వ్యవసాయ ఉత్పత్తులను అమ్మేందుకు రైతులు మార్కెట్ కు వెళ్లేవారు. ఇక అప్పట్లో రవాణా వ్యవస్థ అంతగా లేకపోయింది. దీంతో పోలింగ్ జరిగే కొన్ని ప్రాంతాలకు చేరుకోవడానికి దాదాపు ఒకరోజు సమయం పట్టేది.
కాబట్టి సోమవారం, గురువారం పరిగణనలోకి తీసుకోకుండా.. అన్నింటికంటే మంగళవారమే పోలింగ్ నిర్వహించడానికి సరైన రోజు అని భావించారు. దీంతో అప్పటి నుంచి నవంబర్ మొదటి వారంలో మంగళవారం రోజునే అమెరికాలో ఎన్నికలు నిర్వహిస్తూ వస్తున్నారు.