America: కలకలం రేపుతున్న బర్డ్ ఫ్లూ.. అమెరికాలో తొలి మరణం

అమెరికాలో తొలి బర్డ్ ఫ్లూ మరణం కలకలం రేపుతోంది. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఓ వ్యక్తి లుసియానాలో ఆసుపత్రి చేరగా.. చికిత్స పొందుతూనే మరణించాడు. ఎక్కువగా అడవిలో తిరగడం, పక్షుల దగ్గరకు వెళ్లడం వల్ల ఆ వ్యక్తికి హెచ్‌5ఎన్‌1 సోకిందని వైద్యులు తెలిపారు.

New Update
Australia: భారత్‌ నుంచి ఆస్ట్రేలియాకు బర్డ్‌ఫ్లూ కేసు-డబ్ల్యూహెచ్‌వో

Bird Flue

అమెరికాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. తాజాగా లూసియానాలో ఓ వ్యక్తి బర్డ్ ఫ్లూతో మరణించినట్లు సమాచారం. పలు అనారోగ్య సమస్యలతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి వాటితో ఓ 65 ఏళ్ల వ్యక్తి ఆసుపత్రిలో చేరాడు. చికిత్స తీసుకుంటూనే ఆ వ్యక్తి బర్డ్ ఫ్లూతో మరణించాడు. ఎక్కువగా అడవిలో తిరగడం, పక్షుల దగ్గరకు వెళ్లడం వల్ల హెచ్‌5ఎన్‌1 ఆ వ్యక్తికి సోకిందని వైద్యులు తెలిపారు. బర్డ్ ఫ్లూతో తొలి మరణం నమోదు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 

ఇది కూడా చూడండి:Car Accident: చింటూ టార్చర్‌ వల్లే చనిపోతున్నాం.. కారు దగ్ధం బాధితులు!

ఇది కూడా చూడండి: USA: హెచ్–1 వీసాదారులకు గుడ్‌ న్యూస్.. స్టాంపింగ్‌ ఇక అమెరికాలోనే...

బర్డ్ ఫ్లూ సోకిన వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

బర్డ్ ఫ్లూ వైరస్ ఒకరి నుంచి ఇతరులకు వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ప్రతీ ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ వైరస్ సోకిన వారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. దగ్గు, జ్వరం, గొంతు మంట, కండరాల నొప్పులు, శ్వాస ఆడకపోవడం, తలనొప్పి, వికారం, వాంతులు, అతిసారం వంటి లక్షణాలు ఉంటాయి. ఏ మాత్రం తేడా అనిపించిన కూడా వెంటనే వైద్యుని సంప్రదించండి. ఈ వైరస్ సోకిన వారు తప్పకుండా పరిశుభ్రత పాటించాలి. గుడ్లు, పాశ్చరైజ్ చేయని పాలు, మాంసం, ఫాస్ట్ ఫుడ్ వంటివి తినకూడదు. చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. 

ఇది కూడా చూడండి: Keir Starmer:మస్క్‌ చెప్పేవన్నీ అబద్దాలే..బ్రిటన్‌ ప్రధాని!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు