/rtv/media/media_files/2024/11/07/3sHpKoRIGgFTXgxNUua9.jpg)
వైట్ హౌస్ ను లాక్ చేశారు. ప్రెసిడెంట్ ట్రంప్ ను సేఫ్ రూమ్ లో ఉంచారు. ఈ రోజు వైట్ హౌస్ నార్త్ లాన్ లో గుర్తు తెలియని వస్తువు ఎవరో విసిరేయడంతో అక్కడ అంతా గందరగోళం నెలకొంది. సరిగ్గా గతేడాది ఇదే రోజు అధ్యక్షుడు ట్రంప్ పై దాడి జరిగింది. దీంతో వైట్ హౌస్ భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. మీడియాను వెంటనే బ్రీఫింగ్ రూమ్ కు తరలించారు. దాని తరువాత అరగంట పాటూ మొత్తం వైట్ హౌస్ అంతా తనిఖీలు చేశారు. అగంతకులు విసిరేసిన వస్తువును పరీక్షించారు. అయితే ఎటువంటి ప్రమాదం లేదని తేలడంతో తరువాత క్లియరెన్స్ ఇచ్చారు.
మీడియా నివేదికల ప్రకారం, గుర్తు తెలియని వ్యక్తి వైట్ హౌస్ కంచెకు అడ్డంగా ఏదో విసిరాడు. దీంతో వెంటనే వైట్ హౌస్ తో పాటూ పెన్సిల్వేనియా అవెన్యూను కూడా మూసివేశారు. ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ తరువాత 'ఎవరో తన ఫోన్ విసిరారు' అని ఒక ప్రకటన విడుదల చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెన్సిల్వేనియాలో ఒక కార్యక్రమానికి బయలుదేరబోతున్న సమయంలో ఈ సంఘటన జరిగిందని చెప్పారు.
ఏడాది క్రితం ఇదే రోజున..
సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున ఎన్నికల ప్రచారంలో ఉన్న అధ్యక్షుడు ట్రంప్ మీద దాడి జరిగింది. ఆయనపై మాథ్యూ క్రూక్స్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. దీంట్లో ట్రంప్ కుడిచెవికి గాయం అయింది. దాంతో పాటూ ఒక అగ్నిమాపక సిబ్బంది మరణించగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సరిగ్గా ఇప్పుడు ఇదే రోజున మళ్ళీ ఇలా జరగడం అనుమానాలకు తావిస్తోంది. వైట్ హౌస్ భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
Also Read: IND-US Trade: భారత్ పై 'నాన్ వెజ్' పాల కుట్ర.. ట్రంప్ ప్లాన్ ను తిప్పికొట్టిన భారత్!