Trump Tariffs: సుంకాల గడుపు పొడిగింపు ఎందుకు..ట్రంప్ చర్యల వెనుక కారణం ఏంటి?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం ప్రతిచోటా తన టారిఫ్ బాంబులను పేల్చుతున్నారు. తాజాగా బ్రిక్స్ సమావేశంలో కూడా దీనిపై మాట్లాడారు. దీంతో ఆగస్టు 1 నుంచి అమలయ్యే టారీఫ్ లపై అందరిలో మళ్ళీ గుబులు మొదలైంది. 

New Update
tariffs new deadline

Trump tariffs new deadline

Trump Tariffs: ప్రతీకార సుంకాల విషయం మోసారి తెర మీదకు వచ్చింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన గడువు ముగియడంతో దానిని మరో 21 రోజులు పొడిగిస్తూ లేఖపై సంతకం చేశారు. దాంతో పాటూ జపాన్, కొరియాలతో సహా మరో 14 దేశాలపై 25శాతం టారీఫ్ లను విధించారు. ఆగస్టు 1 నుంచి అన్ని దేశాలపై  సుంకాలు అమలు అవుతాయని చెప్పారు. ఒప్పందాలపై చర్చలు జరపడానికి మరింత సమయం ఇవ్వడానికే టారీష్ లపై డెడ్ లైన్ పొడిగించారని వైట్ హౌస్ తెలిపింది. ఆర్థిక అస్థిరత, అంతర్జాతీయ ప్రతిచర్యను నివారించడానికి ట్రంప్ పరిపాలన గడువును వాయిదా వేయాల్సి వచ్చింది చెప్పింది. 

సుంకాలపై అమెరికాతో ఇప్పటివరకు రెండు దేశాలు మాత్రమే ఒప్పంద కుదుర్చుకున్నాయి. ఒకటి బ్రిటన్‌తో, మరొకటి వియత్నాంతో. ఈ ఒప్పందాలు కూడా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. వీటిపై కూడా మరింత చర్చించే అవసరం ఉంది. మరోవైపు చైనాతో కూడా తాత్కాలిక ఒప్పంద కుదిరినట్లు తెలుస్తోంది.  దీనిలో కొన్ని సుంకాలు ఉపసంహరించుకోవడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. అదే సమయంలో, భారతదేశం, యూరోపియన్ యూనియన్‌తో చర్చలు జరుగుతున్నాయి.  మరో రెండు రోజుల్లో అగ్రిమెంట్ జరగొచ్చని తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా టారీఫ్ ల విషయం రాజకీయ, సామాజికంగా సున్నితమైన అంశం. ఇది వాణిజ్య యుద్ధానికి కూడా దారి తీస్తోంది. అందుకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నారని...అందులో భాగంగానే గడువు మరోసారి పొడిగించారని వైట్ హౌస్ అధికారులు చెబుతున్నారు. 

Also Read: Elon Musk : ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ ఎత్తుగడ..పార్టీలో భారతీయుడికి కీలక పదవి

Also Read: Himachal Pradesh: బంగారం, డబ్బు నీళ్ళ పాలు..బ్యాంక్ ను ముంచెత్తిన వరద

ట్రంప్ బెదిరింపులు(Donald Trump Tariffs )..

ఇదెలా ఉంటే మరో పక్క టారీఫ్ ల విషయంలో అధ్యక్షుడు బెదిరింపులకు దిగారు. ఆగస్టు 1 నాటికి ఎటువంటి ఒప్పందం కుదరకపోతే, 10 నుండి 70 శాతం వరకు జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ ట్రంప్ 13 దేశాలకు లేఖ పంపారు. ఇప్పటికే జపాన్, కొరియాలకు ఈ లేఖలు అందాయి. అంతేకాకుండా, ట్రంప్ పరిపాలన బ్రిక్స్ దేశాలకు చెందిన అమెరికన్ వ్యతిరేక విధానాలకు మద్దతు ఇచ్చే దేశాలపై అదనంగా 10 శాతం సుంకం విధిస్తామని ఆయన బెదిరించారు. ఇప్పటివరకు ఆయన మయన్మార్‌పై అత్యధికంగా 40 శాతం సుంకాన్ని విధించారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు