Donald Trump: ట్రంప్‌కు ఏమైంది? జపాన్‌లో అయోమయంలో అమెరికా అధ్యక్షుడు.. వీడియో వైరల్!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మానసిక స్థితిపై మరోసారి చర్చ మొదలైంది. జపాన్‌ పర్యటనలో భాగంగా నిర్వహించిన గౌరవవందనం సందర్భంగా ఆయన ప్రవర్తించిన తీరు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అధికారిక కార్యక్రమం సందర్భంగా ఏం చేయాలో తెలియక అయోమయానికి గురయ్యాడు.

New Update
Did Donald Trump salute Japan’s Flag?

What happened to Trump?

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మానసిక స్థితిపై మరోసారి చర్చ మొదలైంది. జపాన్‌ పర్యటనలో భాగంగా నిర్వహించిన గౌరవవందనం సందర్భంగా ఆయన ప్రవర్తించిన తీరు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక దేశాధినేతగా గౌరవ వందనం స్వీకరించేటప్పుడు ఎలా ప్రవర్తించాలో కూడా ట్రంప్‌కు తెలియదా? అంటూ నెటిజన్లు ఆయన తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ తన చివరి రోజుల్లో మాటల తడబాటుతో సోషల్ మీడియాలో మీమ్స్‌కు ఎలాగైతే కేంద్ర బిందువుగా మారారో, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇప్పుడు అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. జపాన్ పర్యటనలో ఆయన పాల్గొన్న అధికారిక కార్యక్రమం సందర్భంగా ఏం చేయాలో తెలియక అయోమయానికి గురైయ్యాడు. ఇది ఇపుడు చర్చనీయంశంగా మారింది.


 అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మూడు రోజుల పర్యటన నిమిత్తం జపాన్ కు వెళ్లాడు. ఈ సందర్భంగా టోక్యోలో ఆ దేశ నూతన ప్రధాని సనే టకాయిచి సైనిక వందనంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తీసిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న సమయంలో ట్రంప్ మొదట సెల్యూట్ చేయడానికి చెయ్యి పైకి ఎత్తారు. అయితే, అది ప్రోటోకాల్ కాదని గ్రహించారో ఏమో, వెంటనే దించేశారు. ఆ తర్వాత జపాన్ ప్రధానితో కలిసి నడుస్తుండగా, ప్రోటోకాల్ ప్రకారం ఒకచోట ఆగాలని ప్రధాని టకాయిచి సైగ చేసినట్లు కనిపిస్తుంది. కానీ ట్రంప్ ఆ విషయాన్ని గమనించకుండా, తన ఆలోచనల్లో తాను ఉన్నట్లుగా ముందుకు నడిచి వెళ్లిపోయారు. దీంతో జపాన్ ప్రధాని ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, నోరు తెరిచి చూస్తుండిపోయారు. ఆ తర్వాత ఆమె వేగంగా నడిచి ట్రంప్‌ను చేరుకున్నారు.

అంతటితో అయిపోయిందా అంటే అది లేదు. వేదిక వద్దకు వెళ్లే దారిని చూపిస్తూ ఒక సైనికాధికారి సైగ చేశాడు. కానీ, ట్రంప్ దాన్ని కూడా పట్టించుకోలేదు. ఏదో పార్కులో నడుస్తున్నట్లుగా నిదానంగా, నిరాసక్తంగా ముందుకు నడుస్తూ పోయారు. వాస్తవానికి ఆయన 90 డిగ్రీల కోణంలో వేదిక వైపు తిరగాల్సి ఉండింది. చివరికి, జపాన్ ప్రధాని మరోసారి దారి చూపడంతో ట్రంప్ ఆమెను అనుసరించి ఇరు దేశాల జాతీయ గీతాలు ఆలపించే వేదిక వద్దకు చేరుకున్నారు.

గత కొంతకాలంగా ట్రంప్ మానసిక ఆరోగ్యంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో పలువురు ప్రపంచ నాయకుల పేర్లను, దేశాలను తికమకపడి పలికిన విషయం తెలిసిందే. భారత్ -పాకిస్థాన్ మధ్య అణుయుద్ధాన్ని సుంకాల ద్వారా ఆపానని చెప్పే క్రమంలో భారత్‌కు బదులుగా ఇరాన్ అని ప్రస్తావించి ఆశ్చర్యపరిచారు. మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ జాన్ గార్ట్‌నర్ ఇటీవల మాట్లాడుతూ.. ట్రంప్ నడక, కదలికల్లో మార్పులు కనిపిస్తున్నాయని, ఇవి డిమెన్షియా (మతిమరుపు వ్యాధి) ప్రారంభ లక్షణాలు కావచ్చని అభిప్రాయపడడం గమనార్హం. అయితే, ఈ ఆరోపణలను వైట్‌హౌస్ వర్గాలు ఖండించాయి. అధ్యక్షుడికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు, మతిమరుపు లక్షణాలు లేవని తేల్చి చెప్పాయి. భవిష్యత్తులో ఆయన ప్రవర్తనను బట్టి అసలు విషయం ఏంటో తేటతెల్లం కానుంది.

 Also Read: Pak Minister: భారత్ చేతిలో ఆఫ్ఘాన్ కీలుబొమ్మ.. మళ్ళీ నోరు పారేసుకున్న పాక్ మంత్రి

Advertisment
తాజా కథనాలు