Snow Storm: అమెరికాను కప్పేసిన మంచు తుఫాను..8 వేల విమానలు రద్దు

అమెరికాను మంచు ముంచేసింది.  దాదాపు 11 రాష్ట్రాల్లో భారీగా మంచు కురుస్తోంది. దాంతో పాటూ అత్యంత కనిష్ట ఉష్ఱోగ్రతలు నమోదవుతున్నాయి.  స్నో కారణంగా చాలా విమానాలు కూడా రద్దయ్యాయి. 

New Update
snow storm

టెక్సాస్ నుంచి వర్జీనియా వరకు అమెరికాతో మంచు తుఫాను భీభత్సం సృష్టిస్తోంది.  నాలుగు రోజుల క్రితం నుంచి వాతావారణశాఖ దీని గురించి హెచ్చరిస్తూనే ఉంది. దానికి తగ్గట్టే 11 రాష్ట్రాల్లో మంచు భారీగా కురుస్తోంది. చాలా రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని చోట్ల ఉష్ణోగ్రత మైనస్ 23 కన్నా తక్కువకు పడిపోయింది. శుక్రవారం రాత్రి నుంచి మంచు కురుస్తూనే ఉంది. ఇంకో 24 గంటలు పడుతుందని...తరువాత కూడా నాలుగైదు రోజులు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయని చెబుతున్నారు.  దీని కారణంగా అమెరికాలో 20 కోట్ల మంది ప్రజలు ప్రభావితం అవుతున్నారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని రాష్ట్రాలు హెచ్చరిస్తున్నాయి. పవర్ అవుటేజ్ కూడా ఉండొచ్చని...జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. కెంటకీ, వర్జీనియా, కాన్సస్, ఆర్కాన్సాస్, జార్జియా, మిసిసిపి సహా పలు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీని ప్రకటించారు. 

8వేల విమానాలు రద్దు..

మరోవైపు మంచు తుఫాను కారణంగా అమెరికాలో వేల్లలో విమానాలు రద్దవుతున్నాయి. శనివారం ఒక్కరోజే దాదాపు 4 వేల విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. అలాగే ఆదివారం కూడా 7 వేల ఫ్లైట్లు రద్దవనున్నాయని అధికారులు తెలిపారు. మంచు తుపాను కారణంగా ఈ నెల 25, 26 తేదీల్లో న్యూయార్క్, న్యూజెర్సీలకు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే విమాన సర్వీసులను రద్దుచేసినట్లు ఎయిరిండియా ప్రకటించింది. 

చాలచోట్ల మంచు తుఫాను కారణంగా శుక్రవారం నుంచి మంగళవారం వరకు స్కూళ్ళకు సెలవులు ఇచ్చారు. అలాగే ప్రజలను కూడా ఇళ్ళు దాటి బయటకు రావొద్దని హెచ్చరించారు. అత్యంత అవసరం అయితే కానీ రోడ్ల మీద తిరగొద్దని చెబుతున్నారు.  రోడ్లపై మంచు పేరుకుపోవడంతో కార్లు, వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉందని..జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఎప్పటికప్పుడూ క్లియర్ చేస్తూనే ఉన్నా.. కంటిన్యూగా మంచు పడుతుండడంతో మళ్ళీ పేరుకుపోతోంది.  రేపు రాత్రి వరకు ఇదే పరిస్థితి ఉంటుంది. దాని తరువాత కూడా మంచు కరగడానికి ఒకటి, రెండు పడుతుందని...అంత వరకు కేర్ ఫుల్ గా ఉండాలని సూచించారు. 

Also Read: USA: మినియాపోలిస్ లో మరోసారి ICE కాల్పులు..ఓ వ్యక్తి మృతి

Advertisment
తాజా కథనాలు