/rtv/media/media_files/2025/09/07/usa-2025-09-07-22-36-30.jpg)
వెనిజులాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎప్పటి నుంచో కత్తి కట్టారు. అక్కడి నుంచి మాదక ద్రవ్యాలు అమెరికాను ముంచెత్తుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. అక్కడి కొన్ని ముఠాలు దీని వెనుక ఉన్నాయని...దానికి వెనిజులా నికోలస్ మదురోకు కూడా సపోర్ట్ చేస్తున్నారని చెబుతోంది. వెనిజులా అధ్యక్షుడిని పట్టనివ్వాలని కూడా అమెరికా ఎప్నటి నుంచో కోరుతోంది. ముదురో సమాచారం ఇస్తే ఏకంగా 50 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.430 కోట్లు) బహుమతి కూడా ప్రకటించింది. ముదురూ ఎన్నికలను వైట్ హౌస్ గుర్తించడం లేదని వైట్ హౌస్ సెక్రటరీ కరోలిన్ లెవెట్టి తెలిపారు. అక్కడ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ట్రంప్ కార్యవర్గం సన్నద్ధం అయింది.
మాదక ద్రవ్యాలపై దండయాత్ర..
దీనికి సంబంధించి కరేబియన్ సముద్రంలో భారీగా సైన్యాన్ని మోహరించింది అమెరికా. భారీ యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, అత్యాధునిక ఫైటర్‌జెట్‌లను రంగంలోకి దింపింది. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్న దేశం చుట్టూ ఇవి టైమ్ కోసం వెయిట్ చేస్తున్నాయి. ఏ క్షణమైనా అమెరికా దళాలు వెనిజులాను ఆక్రమించుకోవచ్చని చెబుతున్నాయి. మేదక ద్రవ్యాల ముఠాల కోసమే ఇదంతా అని అమెరికా చెబుతోంది. దీనికోసం మొత్తం ఎనిమిది వార్ షిప్ లను పంపించింది. ది ఇవో జిమా యాంఫిబియస్ రెడీగ్రూప్‌లోని యూఎస్‌ఎస్ శాన్ ఆంటోనియో, యూఎస్‌ఎస్ ఇవో జిమా, యూఎస్‌ఎస్ ఫోర్ట్ లాడర్‌డేల్ నౌకలు 4,500 మంది సైనికులతో కరేబియన్ సముద్రంలోకి వెళ్లాయి. వీటిల్లో 22వ మెరైన్ యూనిట్ కమాండోలు 2,200 మంది ఉన్నారు. ఇవి కాకుండా ఏవీ-8బీ హారియర్ అటాక్ ఎయిర్ క్రాఫ్ట్, గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్లైన యూఎస్‌ఎస్ జాన్సన్ డున్హమ్, యూఎస్‌ఎస్ గ్రేవ్లీలను కూడా సముద్రంలో ఉంచారు. యూఎస్ఎస్ శాంప్సన్ కూడా తూర్పు పసిఫిక్ లోకి వ్చి చేరుతుందని అమెరికా చెబుతోంది. మరోవైపు శుక్రవారం రాత్రి 10 ఎఫ్-35 ఫైటర్ జెట్‌లను ప్యూర్టోరికోలో మోహరించింది. పెద్ద సంఖ్యలో పీ-8 నిఘా విమానాలను రంగంలోకి దించింది.
చమురు నిల్వలపై కన్ను..
వెనిజులా భౌగోళికంగా కొలంబియాకు సమీపంలో ఉంది. కొలంబియా ప్రపంచంలోనే అతిపెద్ద కొకైన్ ఉత్పత్తిదారు.
కొలంబియా నుండి వచ్చే కొకైన్ తరచుగా వెనిజులా మార్గం గుండా కరేబియన్, మధ్య అమెరికా, చివరికి అమెరికా మరియు యూరప్ మార్కెట్లకు చేరుతుంది. వెనిజులాలోని కొంతమంది సైనిక అధికారులు, రాజకీయ నాయకులు ఈ రవాణాకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వెనిజులాలో ఎంతలా మాదక ద్రవ్యాలు సప్లై అవుతాయంటే...దళాలకు దొరికినప్పుడు ముఠాలు సముద్రంలో కొకైన్ పారబోస్తారు. ఈ దెబ్బకు అక్కడి షార్క్ చేపల్లో కూడా దాని ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఇదొక్కటే కాదు వెనిజులా లో చమురు నిల్వలు కూడా అధికంగా ఉన్నాయి. స్టాటిస్టికల్ రివ్యూ ఆఫ్ వరల్డ్ ఎనర్జీ లెక్కల ప్రకారం 2021 నాటికి ఈ దేశంలో 48 వేల మిలియన్ టన్నుల చమురును గుర్తించారు. ఇవి సౌదీలో నిల్వల కంటే అధికం. ప్రపంచ చమురులో 17శాతానికి సమానం. కానీ అక్కడి నుంచి అంత చమురు ఎగుమతి మాత్రం అవడం లేదు. దీనిపై ట్రంప్ ఎప్పటి నుంచో కన్నేసి ఉంచారు. అసలు ఇప్పటి వరకు ఎందుకు చమురు కోసం యుద్ధం చేయలేదని అడిగినట్టు కూడా తెలుస్తోంది. భౌగోళికంగా అమెరికాకు దగ్గరగా ఉన్న వెనిజులా నుంచి చమురు ఎందుకు రావడం లేదనేది ట్రంప్ ప్రశ్న. దీనికి అమెరికా అక్కడి ప్రభుత్వ రంగ కంపెనీ పెట్రోలియస్ డె వెనుజువెలా ఎస్‌ఏపై ఆంక్షలు విధించడమే దీనికి కారణం. అగ్రరాజ్యంతో పాటు కెనడా, ఐరోపా సమాఖ్య తదితర దేశాలు కలిసి 350 ఆంక్షలు విధించాయి.