China Data Leak : చైనా జనరల్ దేశద్రోహం.. అమెరికాకు అణు డేటా లీక్!

అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు అత్యంత నమ్మకస్తుడు, చైనా సైన్యంలోనే నంబర్ 2 పొజిషన్‌లో ఉన్న జనరల్ షాంగ్ యుక్సియాపై విచారణ మొదలవ్వడం ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది.

New Update
china

చైనా మిలిటరీ(china-military) లో ఇప్పుడు అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ప్రపంచ దేశాలన్నీ ఆశ్చర్యపోతున్నాయి. అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు అత్యంత నమ్మకస్తుడు, చైనా సైన్యంలోనే నంబర్ 2 పొజిషన్‌లో ఉన్న జనరల్ షాంగ్ యుక్సియాపై విచారణ మొదలవ్వడం ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది.

చైనాలో ఇప్పుడు ఒకటే చర్చ.. అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తన సొంత మనిషినే ఎందుకు టార్గెట్ చేశారు? చైనా సైన్యానికి (PLA) పెద్ద దిక్కుగా ఉన్న జనరల్ షాంగ్ యుక్సియా ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. ఆయనపై అవినీతి ఆరోపణలు ఒకెత్తు అయితే, చైనాకు చెందిన అత్యంత రహస్యమైన అణు ఆయుధాల డేటాను అమెరికాకు అమ్మేశారు అనే వార్త ఇప్పుడు ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. - China Data Leak

Also Read :  అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. టేకాఫ్ అవుతుండగా రన్‌వేపై

నిజానికి షాంగ్ యుక్సియా అంటే జిన్‌పింగ్‌కు ప్రాణం. ఇద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు. అలాంటి వ్యక్తిపై చైనా రక్షణ శాఖ విచారణకు ఆదేశించింది. ఆయనపై వచ్చిన ప్రధాన ఆరోపణలు ఏంటంటే..  

చైనా దగ్గర ఎన్ని అణు బాంబులు ఉన్నాయి? అవి ఎలా పనిచేస్తాయి? అనే ముఖ్యమైన టెక్నికల్ సమాచారాన్ని అమెరికాకు లీక్ చేశారని వాల్ స్ట్రీట్ జర్నల్ లాంటి అంతర్జాతీయ మీడియా కోడై కూస్తోంది. మిలిటరీలో పదవుల కోసం భారీగా లంచాలు తీసుకోవడం, తన వాళ్లకు సీట్లు ఇచ్చుకోవడం లాంటివి చేశారట. ఇక సైన్యంలో జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా ఒక సొంత గ్రూపును తయారు చేస్తున్నారనే అనుమానం కూడా ఉంది.

Also Read :  రెండేళ్ల చిన్నారిని అరెస్ట్ చేసిన అమెరికా అధికారులు

గత 30 ఏళ్లలో ఇదే మొదటిసారి

జిన్‌పింగ్ అధికారంలోకి వచ్చాక సైన్యంపై పట్టు పెంచుకోవడానికి చాలా మంది అధికారులను తీసేశారు. కానీ, ఇంత పెద్ద హోదాలో ఉన్న వ్యక్తిపై వేటు వేయడం గత 30 ఏళ్లలో ఇదే మొదటిసారి. చైనాలో సైనిక తిరుగుబాటు జరిగిందని మొన్నటిదాకా సోషల్ మీడియాలో వచ్చిన పుకార్లకు, ఈ విచారణకు ఏదో లింక్ ఉందని జనం అనుకుంటున్నారు.సరిహద్దుల్లో మనతో ఎప్పుడూ గొడవ పడే చైనా సైన్యంలో ఇలాంటి గందరగోళం రావడం గమనార్హం. అక్కడి నాయకత్వంలో గొడవలు జరిగితే అది వారి రక్షణ వ్యూహాలను దెబ్బతీస్తుంది. ఏదేమైనా, చైనా తన సొంత అణు రహస్యాలనే కాపాడుకోలేకపోయిందా? అనే చర్చ ఇప్పుడు గట్టిగా నడుస్తోంది.

చైనా మిలిటరీ నాయకత్వంలో ఇలాంటి అస్థిరత కలగడం భారత్‌కు కూడా కీలకమైన అంశమే. సరిహద్దుల్లో చైనా దూకుడుగా ఉన్న సమయంలో, ఆ దేశ అగ్ర సైనికాధికారులపై విచారణలు జరగడం వల్ల చైనా రక్షణ వ్యూహాలు, నిర్ణయాలపై ప్రభావం పడే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు