Plane Crash : అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. టేకాఫ్ అవుతుండగా రన్‌వేపై

మైనే రాష్ట్రంలోని బంగోర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఆదివారం రాత్రి టేకాఫ్ అవుతున్న సమయంలో ఒక ప్రైవేట్ బిజినెస్ జెట్ (Bombardier Challenger 650) రన్‌వేపై అదుపుతప్పి బోల్తా పడింది.

New Update
us (1)

అమెరికా(america) ను వణికిస్తున్న ఫెర్న్ మంచు తుపాను ఒక ఘోర విమాన ప్రమాదానికి కారణమైంది. మైనే రాష్ట్రంలోని బంగోర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఆదివారం రాత్రి టేకాఫ్ అవుతున్న సమయంలో ఒక ప్రైవేట్ బిజినెస్ జెట్ (Bombardier Challenger 650) రన్‌వేపై అదుపుతప్పి బోల్తా పడింది. విమానం బోల్తా(Plane Crash) పడిన వెంటనే మంటలు చెలరేగడంతో విమానాశ్రయం ఒక్కసారిగా దట్టమైన పొగతో నిండిపోయింది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 7:45 గంటల ప్రాంతంలో ఒక సంఘటన జరిగిందని సమాచారం.  

Also Read :  అమెరికాలో మంచు తుపాను బీభత్సం.. 3 లక్షల మందికి పైగా

మొత్తం ఎనిమిది

హ్యూస్టన్‌కు చెందిన ఒక కంపెనీకి చెందిన ఈ విమానం ప్రమాదానికి గురైన సమయంలో అందులో మొత్తం ఎనిమిది మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మైనస్ 16 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతలు, విపరీతమైన మంచు కురవడం వల్ల విజిబిలిటీ  తగ్గి ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే అధికారులు బంగోర్ ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేసి, విమాన సర్వీసులను రద్దు చేశారు.

ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA), నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించాయి. కేవలం వాతావరణం వల్లే ఈ ప్రమాదం జరిగిందా? లేక విమానంలో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తిందా? అనే కోణంలో అధికారులు విచారిస్తున్నారు. మంచు తుపాను కారణంగా ఇప్పటికే అమెరికా అంతటా జనజీవనం అతలాకుతలమైన వేళ, ఈ విమాన ప్రమాదం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.


మరోవైపు అమెరికాను భయంకరమైన మంచు తుపాను వణికిస్తోంది. ఫెర్న్ పేరుతో విరుచుకుపడుతున్న ఈ తుపాను కారణంగా దేశవ్యాప్తంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. దక్షిణ రాష్ట్రాల నుంచి ఈశాన్య ప్రాంతాల వరకు విస్తరించిన ఈ మంచు బీభత్సం వల్ల సుమారు పది లక్షల ఇళ్లు, వ్యాపార సముదాయాలు అంధకారంలో మునిగిపోయాయి. భారీగా కురుస్తున్న మంచు, గడ్డకట్టే చలి కారణంగా విద్యుత్ లైన్లు తెగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Also Read :  రెండేళ్ల చిన్నారిని అరెస్ట్ చేసిన అమెరికా అధికారులు

Advertisment
తాజా కథనాలు