F1, J1 Visa Rules: అమెరికాలో విద్యార్థులు, ఉద్యోగులపై మరో బాంబ్..వీసా కాలపరిమితి కుదింపు

విద్యార్థులు, వీసాదారులపై అమెరికా డిపార్ట్ మెంట్ హోమ్ ల్యాండ్ మరో బాంబ్ పేల్చింది. విదేశీ విద్యార్థులు, కొన్ని వీసాలపై పరిమితులను విధించింది. అమెరికాలో ఉండే కాలపరిమితిని నాలుగేళ్ళకు కుదించారు.  

New Update
F1 Visa

F1 Visa

ఇప్పటికే విదేశీ విద్యార్థలు వీసాలను కఠినతరం చేసింది అమెరికా. దాంతో పాటూ సోషల్ మీడియా వెట్టింగ్ ను సూపర్ స్ట్రిక్ట్ గా అమలు చేస్తోంది. దీనికి తోడు మరో కొత్త రూల్ ను ఇప్పుడు ప్రవేశపెట్టనుంది యూఎస్ డిపార్ట్  మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్. విద్యార్థులు, ఎక్స్ఛేంజ్ విజిటర్లు, మీడియా ప్రతినిధులకు జారీ చేసే వీసాలపై కాలపరిమితిని విధించింది. ఇకపై విదేశీ విద్యార్థులు నాలుగేళ్ళకు మించి ఉండకుండా వీసా నిబంధనలను కఠినం చేయనుంది. 

నాలుగేళ్ళు మాత్రమే..

ప్రస్తుతం విదేశీ విద్యార్థులు ఎఫ్ 1 వీసాలపై అమెరికాలో చదువుకోవడానికి వస్తున్నారు. ఎక్స్ఛేంజ్ విజిటర్లు జే 1 వీసాలపై వస్తున్నారు. అయితే వీరి వీసా గడువు అయిపోయాక కూడా డ్యూరేషన్ ఆఫ్ స్టే తెచ్చుకుని అమెరికాలో ఉండొచ్చు. వారు ఎంతకాలం చదవాలనుకుంటే లేదా ఇంటర్న్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొనాలనుకుంటే అంతకాలం ఉండొచ్చు. ఎక్స్ఛేంజ్‌ విజిటర్స్‌గా వచ్చే విద్యార్థులు, ప్రొఫెసర్లు, స్కాలర్లు, స్పెషలిస్ట్‌లు, ట్రైనీలు, ఇంటర్న్‌లు, ఫిజీషియన్లకు కూడా ఈ సదుపాయం వర్తిస్తుంది. ఇప్పుడు దీన్నే మార్చేందుకు డిపార్ట్ మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం సిద్ధమైంది. ఇక మీదట ఈ వీసాలకు కొంత కాలం మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. ఈ కొత్త రూల్ భారత విద్యార్థులపై అత్యధిక ప్రభావం చూపనుంది.  ప్రస్తుతం 3.3లక్షల మందికి పైగా భారతీయులు అమెరికా వర్సిటీల్లో చదువుకుంటున్నారు. చదువు తర్వాత అమెరికాలోనే ఉండి ఉద్యోగాలు సంపాదించుకుంటారు చాలా మంది. ఇక మీదట అలా చేయడం కుదరదు. 

కొత్త రూల్స్ ఇవే...

ఈ కొత్త ప్రతిపాదనలను రేపు ఫెడరల్ రిజిస్ట్రీలో పబ్లిష్ చేయనున్నారు. ఆ తర్వాత ప్రతిపాదనపై 30 నుంచి 60 రోజుల వరకు ప్రజాభిప్రాయాన్ని స్వీకరించి ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు. మరోవైపు ఇలాంటి ప్రజాభిప్రాయాలు ఏమీ లేకుండానే తక్షణమే అమల్లోకి వచ్చేలా దీనిపై మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 

ఎఫ్‌, జే వీసా పొందిన విదేశీ విద్యార్థులు, ఎక్స్ఛేంజ్‌ విజిటర్లు అమెరికాలో చదువుకునేందుకు గరిష్ఠ కాల పరిమితి నాలుగేళ్లుగా నిర్ణయించారు.

గ్రాడ్యుయేట్‌ స్థాయి ఎఫ్‌-1 విద్యార్థులు కోర్సు మధ్యలో ప్రోగ్రామ్‌లు మార్చుకుంటే కొత్త రూల్స్ అప్లికబుల్ అవుతాయి.

ఎఫ్‌-1 వీసాతో వచ్చే విద్యార్థులు చదువు పూర్తి చేసుకున్న తర్వాత మరో వీసా కోసం ప్రయత్నించేందుకు కూడా గ్రేస్‌ పీరియడ్‌ను 60 రోజుల నుంచి 30 రోజులకు కుదించారు.

విదేశీ మీడియా సంస్థల ప్రతినిధులు తీసుకునే ఐ-వీసాలతో 240 రోజుల వరకు అమెరికాలో ఉండొచ్చు. ఆ తర్వాత కూడా  మరో 240 రోజుల వరకు తమ నివాస అనుమతిని పొడిగించుకునే అవకాశం కల్పిస్తున్నారు. 

దేశ భద్రతా ప్రయోజనాల దృష్ట్యా చైనీస్‌ మీడియా ప్రతినిధులు అదనపు ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

Also Read:  US-India Trade War: భారత్ చొరవ చూపించకపోతే ట్రంప్ వెనక్కి తగ్గరు..ఆర్థిక మండలి డైరెక్టర్ కెవిన్ హాసెట్

Advertisment
తాజా కథనాలు