Russia-Ukraine Peace Plan: ట్రంప్ శాంతి ప్రణాళిక.. నో చెప్తున్న రష్యా, ఉక్రెయిన్

రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 28 సూత్రాలతో శాంతి ప్రణాళికను రూపొందించారు. దీనికి రెండు దేశాలు వారంలోపు అంగీకారం తెలపాలని అల్టిమేటం కూడా ఇచ్చారు. కానీ దీనికి పుతిన్, జెలెన్ ఇద్దరూ నో చెప్పనున్నారని తెలుస్తోంది.

New Update
russia

ట్రంప్ రూపొందించిన గాజా శాంతి ప్రణాళిక సూపర్ హిట్ అయింది. దీనికి ప్రపంచ దేశాల మద్దతు లబించింది. అలాగే ఇజ్రాయెల్, హమాస్ ఇద్దరూ ఈ ప్రణాళికకు అంగీకారం కూడా తెలిపాయి. ఈ ఉత్సాహంలో ట్రంప్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి కూడా శాంతి ప్రణాళికను రూపొందించారు. 28 సూత్రాలతో ప్రాణాళికను రచించారు. ఎప్పటి నుంచో రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపాలని ట్రంప్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకూ ఆయన ప్రయత్నాలేవీ సఫలం కాలేదు. ఎన్ని చెప్పినా రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం దేనికీ తలొగ్గడం లేదు. ఉక్రెయిన్ తమ దారికి వచ్చే వరకు యుద్ధాన్ని ఆపేది లేదని అంటున్నారు. అందుకే ఇప్పుడు మరో ప్రయత్నంగా ట్రంప్ శాంతి ప్రనాళికను రూపొందించారు. దీనికి ఇరు దేశాలూ అంగీకారం తెలపాలని అల్టిమేటం జారీ చేశారు. వారం రోజులు మాత్రమే గడువు ఇచ్చారు. అలా ఒప్పుకోకపోతే..జీవితాంతం వాళ్ళు పోరాడాల్సిందేనని అన్నారు.

ఒప్పుకునేదే లేదంటున్న జెలెన్..

అయితే ట్రంప్ శాంతి ప్రణాళికపై రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఇద్దరూ సుముఖంగా లేరని తెలుస్తోంది. నిజానికి ఇందులో ఎక్కువగా రష్యాకు అనుకూలంగానే సూత్రాలను రాశారని చెబుతున్నారు. ఇందులో రష్యా ఆశిస్తున్న భూబాగాన్ని కీవ్ వదులుకోవాలని, తన సైన్యాన్ని పరిమితం చేయాలని, యుద్ధాన్ని ముగించడంతో నాటోలో చేరకుండా కట్టుబడి ఉండాలని సూత్రాలను రాశారు. అందుకే దీనికి జెలెన్ స్కీ నో చెప్పనున్నారని అంటున్నారు. అన్నీ రష్యాకు అనుకూలంగా ఉండడంతో దీనికి అంగీకరించకూడదని ఆయన అనుకుంటున్నట్టు తెలుస్తోంది. అవసరమైతే అమెరికాతో స్నేహాన్ని కూడా వదులుకుంటామని పరోక్షంగా హెచ్చరించారు. ప్రస్తుతం తమ దేశం చరిత్రలోనే అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోంటోందని జెలెన్ అన్నారు. ఉక్రెయిన్‌ తన ఆత్మగౌరవాన్ని కోల్పోవడమా..? కీలకమైన భాగస్వామిని వదులుకోవడమా అనే దాన్ని ఎంచుకునే పరిస్థితి ఉందని చెప్పారు. ఉక్రెయిన్ ప్రయోజనాల మేరకే తమ నిర్ణయాలు తీసుకుంటామని..దాని కోసం అవసరమైతే మిత్రులను వదులుకుంటామని స్పష్టం చేశారు. ట్రంప్ ప్రణాళికకు సంబంధించి ప్రత్యామ్నాయాలను ప్రతిపాదిస్తామని జెలెన్ స్కీ తెలిపారు. ఇప్పటికే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తో

రష్యాకు కూడా అంగీకారం కాదు..

తాజాగా ఇందులో తెలుస్తున్న మరొక విషయం ఏంటంటే..రష్యా అధ్యక్షుడు పుతిన్ కు కూడా ట్రంప్ శాంతి ప్రణాళికలో అభ్యంతరకర విషయాలున్నాయని తెలుస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం ఫిబ్రవరి 2022 నుండి రష్యా తనదిగా చెప్పుకుంటున్న నాలుగు ఉక్రెయిన్ ప్రాంతాలు - లుహాన్స్క్, జపోరిజ్జియా, ఖెర్సన్ ,డొనెట్స్క్‌లలో యుద్ధభూమి లాభాలను శాశ్వతంగా లాక్ చేస్తుంది. రష్యా 2014లో క్రిమియాను స్వాధీనం చేసుకోవడం కూడా శాశ్వతంగా మారుతుంది. రష్యా నియంత్రణలో ఉన్న జపోరిజ్జియా అణు విద్యుత్ కేంద్రం స్థితిపై కూడా ఉక్రెయిన్ రాజీ పడవలసి ఉంటుంది.ఇది పునఃప్రారంభించబడుతుంది...అలాగే దాని రష్యా ,ఉక్రెయిన్ 50-50గా పంచుకుంటాయి. దీనికి ఉకరెయిన్ తో పాటూ మాస్కో కూడా సిద్ధంగా లేదని తెలుస్తోంది. దీనివలన ఖేర్సన్, జాపోర్జియాపై రష్యా పూర్తి నియంత్రణ పోతుంది. ఉక్రెయిన్ అప్పగించే డొనెట్స్క్ భాగాన్ని రష్యన్ దళాలు కాపలాగా ఉంచడానికి అనుమతించబడవు. ఇది రష్యాకు ఎంత మాత్రం అంగీకారం కాదు. ఈ ఒప్పందం ప్రకారం దాదాపు 300 బిలియన్ల రష్యన్ ఆస్తులు స్తంభింపజేస్తాయి. ఇవి ఎక్కువగా యూరోప్ లో ఉన్నాయి. అలాగే వాషింగ్టన్ కు 100 బిలియన్లు అప్పగించాల్సి ఉంటుంది. దీనికి కూడా మాస్కో సిద్ధంగా లేదని తెలుస్తోంది. అందుకే ట్రంప్ ప్రణాళికను రష్యా, ఉక్రెయిన్ రెండూ తిరస్కరిస్తున్నాయని అంటున్నారు.

Advertisment
తాజా కథనాలు