/rtv/media/media_files/2025/03/01/Be3syUUBhT4w5F0FzhSa.jpg)
US Dollor
అమెరికా అధ్యక్షడు ట్రంప్ వచ్చాక పరిస్థితులు అన్నీ మారిపోయాయి. ఇప్పటి వరకు యూఎస్ తో మిగతా అన్ని దేశాలకు ఉన్న సంబంధాలు ఇకపై ఉండకపోవచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ట్రంప్ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలపై చాలా దేశాలు గుర్రుగా ఉన్నాయి. కేవలం తమ దేశానికి మాత్రమే ప్రాముఖ్యతను ఇస్తూ మిగతా దేశాలను తొక్కేయాలని చూస్తున్న ట్రంప్ ఆధిపత్యాన్ని జపాన్, సౌదీ, చైనా లాంటి దేశాలు భరించేందుకు రెడీగా లేవు. దీని వలన ప్రపంచ ఎకానమీ మొత్తం ఛేంజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. చాలా దేశాలు అమెరికా ను వాణిజ్య, ఆర్థిక సంబంధాల నుంచి విముక్తి పొందాలని చూస్తున్నాయి. ఈక్రమంలో డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించే మిగతా కరెన్సీ వాల్యూను పెంచే దిశగా ఆలోచిస్తున్నాయి. ముఖ్యంగా జపాన్, చైనా , సౌదీ అరేబియా లాంటి దేశాలు దీని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాయి. భారత్ కూడా అమెరికాతో ఆర్థిక సంబంధాలను తగ్గించుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.
డీ డాలరైజేషన్..
అమెరికా అధ్యక్షుడు అనుసరిస్తున్న విధానాలపై అన్ని దేశాలు తమ వ్యతిరేకతను తెలుపుతున్నాయి. దీంతో ఆ దేశంలో తాము పెట్టుబడులను తగ్గించేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే జపాన్ $4.1 బిలియన్, సౌదీ అరేబియా $15.1 బిలియన్, చైనా $9.6 బిలియన్, స్విట్జర్లాండ్ $9.7 బిలియన్, భారత్ $14.9 బిలియన్ డాలర్ల పెట్టుబడులను తగ్గించాయి. మిగతా ఇతర దేశాలు కూడా చిన్న మొత్తాల్లో తమ పెట్టుబడులను తగ్గించాయి. తమ దేశానికి మాత్రమే ప్రాముఖ్యతను ఇస్తూ...మిగతా దేశాలను తొక్కేయాలని చూస్తున్న ట్రంప్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు, కేంద్ర బ్యాంకులు జాగ్రత్తగా వ్యవహరించాలన్న నిర్ణయానికి వచ్చేస్తున్నాయి. ఇప్పటికే చాలా దేశాలకు తలనొప్పిగా మారిన ట్రంప్ విధానాలు భవిష్యత్తులో ఇంకెన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలపై ఎలా ప్రభావితం చేస్తుందో తెలియక అందరూ జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని భావిస్తున్నారు.
భవిష్యత్తులో తగ్గనున్న అమెరికా ట్రెజరీ?
ట్రంప్ చర్యలకు విసిగిపోయి పెద్ద దేశాలన్నీ అక్కడ పెట్టుబడులు పెట్టడం మానేస్తే...ఆ దేశ ఆర్థిక విధానాల్లో పాల్గొనకపోతే..ఇప్పటికే దారుణంగా పడిపోయిన యూఎస్ ఎకానమీ భవిష్యత్తులో మరింత పడిపోతుంది. దీంతో ఇప్పుడు అమెరికా ప్రభుత్వం ఎంత మొత్తాన్ని అప్పుగా తీసుకోవాలనుకుంటుందో అనేదే ప్రధానమైన విషయంగా మారింది. ట్రంప్ పిచ్చి పిచ్చి విధానాల వలన కచ్చితంగా యూఎస్ డాలర్ బలహీనపడటం లేదా జాతీయ రుణాన్ని పెంచడానికి దారి తీస్తాయని భావిస్తున్నారు.అదే కనుక జరిగితే అమెరికా ట్రెజరీ బాండ్లకు డిమాండ్ తగ్గుతుంది. అప్పుడు విదేశీ పెట్టుబడిదారులు తమ అమెరికాలో ఉన్న తమ ట్రెజరీలను అమ్మేస్తారు. దీని వలన వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంది. అప్పుడు ఏ దేశమూ అమెరికాకు అప్పు ఇవ్వడానికి ముందుకు రాదు. దీని వలన యూఎస్ ఎకానమీ మొత్తం ప్రభావితం అవుతుంది. అమెరికా కుటుంబాలు, వ్యాపారాలపై కూడా ప్రభావం చూపుతుంది. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో బాధపడుతున్న అమెరికా అప్పుడు మరింత కుంగిపోతుంది. ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. సామాన్య జీవనం బతకడమూ కష్టంగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
డాలర్ పడిపోతుంది...
ఈ పరిస్థితులు డాలర్ పతనానికి కారణం అవుతుంది. ఇప్పటివరకు ప్రపంచంలో యూరోల తర్వాత డాలర్ వాల్యూనే చాలా ఎక్కువగా ఉంది. డాలర్ కన్నా యూరో వాల్యూ ఎక్కువే అయినా...డామినేషన్ మాత్రం డాలర్ దే ఉంది. ప్రపంచ ఎకానమీని డాలర్ నడిపిస్తోందిని చెప్పవచ్చును. కానీ యూఎస్ ఎకానమీ దారుణంగా దెబ్బతింటే కనుక డాలర్ వాల్యూ కూడా పడిపోతుంది. అప్పుడు అమెరికా డాలర్ యొక్క గ్లోబల్ డామినెన్స్‌పై ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది. విదేశీ దేశాలు అమెరికా ప్రభుత్వ రుణం నుంచి వెనక్కి తగ్గడం ప్రారంభిస్తే, ఇతర సురక్షితమైన ఆస్తుల వైపు అంటే యూరో-బేస్డ్ బాండ్లు, ఇతర ప్రధాన కరెన్సీలు లేదా బంగారంవైపు మళ్ళుతాయి. అప్పుడు డాలర్ వాల్యూ మన రూపాయి, జపాన్ యెన్ ల కన్నా తక్కువ స్థాయికి పడిపోతుందని చెబుతున్నారు ఆర్ధిక నిపుణులు.
2024 ఎన్నికల్లో ట్రంప్ అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత అమెరికాలో పెట్టుబడులు కాస్త పెరిగాయి. నిజానికి చాలా దేశాలు అమెరికాలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. కానీ ట్రంప్ రూల్స్ కుమాత్రం భయపడుతున్నాయి. ఎప్పుడు ఎలా ఏ విధానం అనుసరిస్తారో తెలియక పెట్టుబడులు పెట్టే ముందు పదిసార్లు ఆలోచిస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో డాలర్ వాల్యూ పడిపోతే..అమెరికాలో వాణిజ్య, రాజకీయ, ఆర్థిక ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది. దాంతో పాటూ పెట్టుబడిదారులు తమ డబ్బును ఇతర దేశాలకు మార్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అమెరికా ట్రెజరీలను సాధారణంగా కేంద్ర బ్యాంకులు భద్రత కోసం నిల్వ చేస్తాయి. కానీ ఇప్పుడు ప్రపంచ దేశాలు తమ నిల్వలను వివిధ కరెన్సీల్లో లేదా బంగారంలో పెట్టాలని చూస్తున్నాయి. దీనినే డీ-డాలరైజేషన్ అంటారు. అక్టోబర్ 2024 నాటికి తన అమెరికా ట్రెజరీ నిల్వలను చైనా $760.1 బిలియన్లకు తగ్గించింది. అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఆధారపడకుండా తన పెట్టుబడులను విభజించుకునే వ్యూహాత్మక ప్రణాళికలో భాగంగా చైనా ఈ పని చేసింది. ఇదే పద్ధతిని మిగతా దేశాలు కూడా అనుసరించాలని చూస్తున్నాయి. భారత్ కూడా ఈ లిస్ట్ లో ఉన్నట్టు తెలుస్తోంది. డాలర్‌పై ఆధారపడటం వల్ల అమెరికాకు భారీ ఆర్థిక అధికారం లభిస్తుంది. కానీ ఇప్పుడు అమెరికా నుంచి ఆ అధికారాన్ని తరలించాలని మిగతా దేశాలు భావిస్తున్నాయి. దీనంతటికీ కారణం ట్రంప్ తలతిక్క ఆర్ధిక విధానాలే అని చెబుతున్నాయి. అందుకే తమ పెట్టుబడులను ఆ దేశం నుంచి తరలించాలని చూస్తున్నాయి. దానికి బదులుగా పోలాండ్, టర్కీ, భారత్, అజర్‌బైజాన్, చైనా వంటి దేశాలు బంగారాన్ని భారీగా కొంటున్నాయి. అంతేకాదు..కొన్ని దేశాలు తమ కరెన్సీని స్థిరంగా ఉంచుకోవడానికి అమెరికా ట్రెజరీలను విక్రయిస్తున్నాయి. జపాన్, ఉదాహరణకు, నవంబర్ 2024 నాటికి $1.087 ట్రిలియన్ నుంచి డిసెంబర్ 2024 నాటికి $1.060 ట్రిలియన్‌కు తగ్గించింది. దీని ద్వారా జపాన్ తమ కరెన్సీ యెన్ విలువను పెంచేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పుడు ఈ డీ-డాలరైజేషన్ కోసం కొన్ని ప్రధాన దేశాలు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి. చైనా, రష్యా, డాలర్‌కు బదులుగా యెన్, రూబుల్‌లలో వాణిజ్యం చేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. భారత్, ఇరాన్ కూడా స్థానిక కరెన్సీలను ఉపయోగించే విధానాలను పరిశీలిస్తున్నాయి.
తగ్గేదేలే అంటున్న బ్రిక్స్ దేశాలు..
ముఖ్యంగా బ్రిక్స్ దేశాలు ఇందులో ముందున్నాయి. ఈ దేశాలు అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల్లో డాలర్‌ను వినియోగించడం మానేస్తే, అమెరికా వాటిపై 100 శాతం పన్నులు విధిస్తుందని ట్రంప్ రీసెంట్ గా బెదిరించారు కూడా. అయినా కూడాతగ్గేదే లేదంటున్నాయి బ్రిక్స్ దేశాలైన బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలు. కొత్త రిజర్వ్ కరెన్సీ సృష్టించే విషయంపై తీవ్రంగా జరుపుతున్నాయి. జరుపుతోంది. ముఖ్యంగా, రష్యా.. అమెరికాకు సన్నిహితంగా ఉంటున్నట్టు కనిపిస్తూనే వెనుక ఆర్థిక వ్యవస్థపై ఆధారపడకుండా ఉండటానికి ఇతర దేశాలను ప్రోత్సహిస్తోంది. ఇందులో భారతదేశం కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుందనే చెప్పాలి. పైకి అమెరికా మాకు మిత్రదేశం, దాంతో ఆర్థిక సంబంధాలకు కట్టుబడి ఉన్నామని చెబుతూనే...డాలర్‌పై ఆధారపడడాన్ని తగ్గించేందుకు భారత్ నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా ప్రోత్సహించేందుకు కూడా ప్రయత్నిస్తోంది. రష్యాతో రూపాయిల్లో వాణిజ్యం జరపడమే దీనికి ఉదాహరణ. ఇక డాలర్ వాల్యూను తగ్గించే చర్యల్లో భాగంగా.. అంతర్జాతీయ చమురు మార్కెట్లో కూడా మార్పులు కనిపిస్తున్నాయి. గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాలు, చమురు కోసం డాలర్‌తో పాటు యెన్ లేదా ఇతర కరెన్సీలను కూడా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇస్తున్నాయి.
మొత్తానికి ఈ అన్ని మార్పులు, అమెరికా డాలర్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వున్న ఆధిపత్యాన్ని క్రమంగా తగ్గించడానికే చూస్తున్నట్టు తెలుస్తోంది. ట్రంప్ ఇప్పటికైనా మేలుకొనకపోతే...తాను అనుసరిస్తున్న ఆర్థిక విధానాలను మార్చుకోకపోతే అమెరికాకు పెద్ద నష్టమే జరుగుతుంది. ప్రపంచానికి పెద్దన్నగా ఉండాలన్నా...తన ఆధిపత్యాన్ని ఎప్పటిలానే ఉంచుకోవాలననా ట్రంప్ తగ్గకతప్పదని చెబుతున్నారు.