Plane Crash: అజిత్ పవార్ ప్రమాదానికి గురైన విమానం.. మళ్లీ 2023 సీన్ రిపీట్

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ లియర్‌జెట్-45 చార్టర్డ్ ఫ్లైట్‌లో బారామతి వెళ్తుండగా ప్రమాదం జరిగి మృతి చెందారు. అయితే 2023లోనూ ఇదే సీన్ రిపీట్ అయినట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తు అందులో ప్రయాణిస్తున్న వారు ప్రాణాలతో బయటపడ్డారు.

New Update
ajith-pawar-plane-crash-2026-01-28-12-11-47

Ajit pawar

మహారాష్ట్ర రాజకీయాల్లో పెను విషాదం నెలకొంది. రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఈ విమాన ప్రమాదంలో చనిపోయారు. ముంబైలో జరిగిన కీలక క్యాబినెట్ సమావేశానికి హాజరైన అజిత్.. అనంతరం తన సొంత నియోజకవర్గమైన బారామతికి వెళ్లేందుకు 'VSR ఏవియేషన్' సంస్థకు చెందిన 'లియర్‌జెట్-45' అనే చార్టర్డ్ విమానంలో బయలుదేరారు. విమానం బారామతి విమానాశ్రయానికి చేరుకుని రన్‌వేపై ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా అదుపుతప్పి కూలిపోయింది. ఈ సమయంలో నేలకు విమానం బలంగా ఢీకొట్టడంతో విమానంలో మంటలు చెలరేగి అజిత్ పవార్‌తో పాటు మరో నలుగురు మృతి చెందారు. వీరిలో సిబ్బంది, పైలట్‌తో పాటు అజిత్ పవార్ పీఏలు కూడా ఉన్నారు. అయితే VSR ఏవియేషన్ సంస్థకు చెందిన లియర్‌జెట్-45 అనే చార్టర్డ్ విమానం ఇప్పుడే కాదు.. గతంలోనూ ప్రమాదానికి కారణమైంది.

ఇది కూడా చూడండి: Ajith Pawar Plane Crash: అజిత్ పవార్ ప్రయాణించిన విమానం 'లీర్జెట్ 45' వివరాలు.. గతంలో కూడా ఇదే విమానానికి ఘోర ప్రమాదం!

గతంలోనూ ప్రమాదం..

2023 సెప్టెంబర్ 14న ఇదే విమాన సంస్థకు చెందిన ఈ మోడల్ విమానం ముంబై విమానాశ్రయంలో ప్రమాదానికి గురైంది. విశాఖపట్నం నుంచి ముంబైకి ఈ విమానం ప్రయాణిస్తోంది. ముంబైలో భారీగా వర్షం కురవడంతో రన్‌వేపై ల్యాండింగ్ సమయంలో విమానం అదుపు తప్పి రెండు ముక్కలైంది. ఆ సమయంలో విమానంలో 8 మంది ఉండగా అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ఒకే విమాన సంస్థకు చెందిన ఒకే మోడల్ విమానాలు పలుమార్లు ఇలా ల్యాండింగ్ సమయంలో ప్రమాదానికి గురి కావడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2023లో ప్రమాదం జరిగిన తర్వాత ఏవియేషన్ సంస్థ సరైన భద్రతా చర్యలు తీసుకోలేదా అనే దానిపై భద్రతా చర్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా లియర్‌జెట్ 45 విమానాల ల్యాండింగ్ గేర్, బ్రేకింగ్ సిస్టమ్‌లో ఏవైనా తయారీ లోపాలు ఉన్నాయా? అనే కోణంలో విచారించనున్నారు. 

ఇది కూడా చూడండి: BIG BREAKING: కుప్పకూలిన విమానం.. డిప్యూటీ సీఎం దుర్మరణం

Advertisment
తాజా కథనాలు