/rtv/media/media_files/2025/09/09/france-2025-09-09-07-41-44.jpg)
Ousted French Prime Minister Francois Bayrou at the National Assembly in Paris on Monday.
ఫ్రెంచ్ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టిన అవిశ్వాస తీర్మానంలో ఘోరంగా ఓటమి పాలైంది. ప్రధానమంత్రి ఫ్రాన్సువా బేరూ నాయకత్వంలోని మైనారిటీ ప్రభుత్వంపై ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి అనుకూలంగా 194 ఓట్లు రాగా..ప్రతికూలంగా 364 మంది ఓటేశారు. దీంతో ప్రధాన బేరూ..అధ్యక్షుడు మేక్రాన్ కు రాజీనామా ఇచ్చారు. బేరూ లాస్ట్ ఇయర్ డిశెంబర్ లో ప్రధానిగా బాధ్యతలు చేటపట్టారు. ఈయన వయసు 74 ఏళ్ళు. ఇప్పుడు ఈయన ప్రభుత్వం పడిపోవడంతో మరోసారి ఫ్రాన్స్ లో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది.
అప్పుల్లో కూరుకుపోయిన ఫ్రెంచ్ ప్రభుత్వం..
ఫ్రాన్సువా బేరూ ప్రభుత్వం ఓటమి పాలవుతుందని ముందు నుంచే అందరూ ఊహించారు. కానీ ఇంత ఘోరంగా అవుతుందని ఎవరూ అనుకోలేదు. సొంత పార్టీలోనే చాలా మంది ఓటేయలేదని చెబుతున్నారు. బేరూ 44 బిలియన్ యూరోల పొదుపు పథకానికి మద్దతు ఇవ్వాలని ఒత్తిడి చేయడమే దీనికి ప్రధాన కారణం అని తెలుస్తోంది. దాంతో పాటూ బడ్జెట్ సమస్యలు, ట్రంప్ టారిఫ్ లు, ఉక్రెయిన్ యుద్ధం, గాజా పరిస్థితి లాంటివి ఫ్రాన్స్ గందరగోళ పరిస్థితులకు కారణంగా నిలిచాయి. రాజకీయ అనిశ్చితులకు కూడా ఇవే కారణమని అంటున్నారు. అయితే ఇప్పుడు ప్రధాని బేరూ రాజీనామా, ప్రభుత్వం పడిపోవడం వలన ఈ సమస్యలేవీ వెంటనే పరిష్కారం అవవు. అలాగే ఆ దేశం మీద ఉన్న రుణ భారం కూడా తొలిగిపోదు. ప్రస్తుతం ఫ్రాన్స్ ప్రభుత్వం 3.3 ట్రిలియన్ల యూరోలు అప్పు కలిగి ఉంది. యూరోజోన్ లో గ్రీస్, ఇటలీ తర్వాత ఫ్రాన్స్ ఉంది. దీనికి తోడు అక్కడ వృద్ధులు బాగా పెరిగిపోయారు. పని చేసే వారు తక్కువ అయిపోయారు. దీని కోసం మాజీ ప్రధాన బేరూ వారానికి రెండు రోజుల సెలవు దినాలను కుదించారు. ఇది కూడా ఆయన ఓటమికి ఒక కారణం అయింది.
ప్రధాని పదవికి బేరూ రాజీనామా చేసిన కొత్త వారు వచ్చేవరకూ ఆయనే కేర్ టేకర్ గా కొనసాగుతారు. వీరు రోజు వారీ వ్యవహారాలను మాత్రమే సమీక్షిస్తారు. కానీ దేశానికి సంబంధించిన పెద్ద పెద్ద నిర్ణయాలను మాత్రం తీసుకోలేరు. అయితే కొత్త ప్రధానిని నియమించడానికి ఎన్ని రోజులు పడుతుందనేది మాత్రం ఇంకా తెలియదు. మరోవైపు అధ్యక్షుడు మాక్రాన్ రాజీనామాకు కూడా అక్కడ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ ఆయన మాత్రం ససేమిరా అంటున్నారు. 2027 వరకూ తాను కొనసాగుతానని తెగేసి చెబుతున్నారు. ఈ క్రమంలో ఎన్నికలు నిర్వహిస్తే మాక్రాన్ సెంట్రిస్ట్ బ్లాక్ దారుణంగా ఓడిపోతుందని అంచనాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఏం చేస్తారనేది తెలియడం లేదు.
Also Read: Peter Navarro: నవారో నోటికి హద్దే లేకుండా పోతోంది..భారత్ కు మంచి ముగింపు లేదంటూ మరోసారి..