/rtv/media/media_files/2024/11/07/3sHpKoRIGgFTXgxNUua9.jpg)
అమెరికా కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారు ఝామున 12.10 అమెరికా ప్రభుత్వం పాక్షిక షట్ డౌన్ లోకి ప్రవేశించింది. నిధుల బిల్లులపై రిపబ్లికన్, డెమోక్రాట్ సెనేట్లు ఒక అంగీకారానికి రాకపోవడంతో ప్రభుత్వాన్ని మూసివేసే పరిస్థితి ఏర్పడింది. దాదాపు ఏడేళ్ళ తర్వాత మొదటిసారిగా ఇది జరిగింది. రిపబ్లికన్ల తరుఫు నుంచి 55 ఓట్లువచ్చినప్పటికీ అవి సరిపోలేదు. ఏదైనా బిల్లు ఆమోదం పొందాలంటే కనీసం 60 ఓట్లు రావాలి. దీంతో బిల్లులు వీగిపోయాయి. అలాగే డెమొక్రాట్లు ప్రతిపాదించిన మరో బిల్లు కూడా 47-53 తేడాతో ఓడిపోయింది. సాధారణ ప్రజల బీమా ప్రీమియంలు పెరగకుండా ఉండేందుకు ACA పన్ను క్రెడిట్‌ల గడువును పొడిగించాలని డెమొక్రాట్లు పట్టుబట్టారు. రిపబ్లికన్లు చేసిన మెడికేయిడ్ కోతలను కూడా వెనక్కి తీసుకోవాలన్నారు. ఈవిషయంలో ఇరువర్గాలు ఒక నిర్ణయానికి రాలేకపోయారు. దీంతో అమెరికా బడ్జెట్ క్లోజ్ అయింది.
అమెరికాలో ప్రభుత్వాన్ని నడిపించడానికి అవసరమయ్యే నిధుల తాత్కాలిక బిల్లులను సెనేట్ ఆమోదించలేదు. రిపబ్లికన్ల తరుఫు నుంచి 55 ఓట్లు వచ్చినప్పటికీ అవి సరిపోలేదు. ఏదైనా బిల్లు ఆమోదం పొందాలంటే కనీసం 60 ఓట్లు రావాలి. దీంతో బిల్లులు వీగిపోయాయి. అలాగే డెమొక్రాట్లు ప్రతిపాదించిన ACA హెల్త్‌కేర్ ప్రొటెక్షన్ల బిల్లు కూడా 47-53 తేడాతో ఓడిపోయింది. సాధారణ ప్రజల బీమా ప్రీమియంలు పెరగకుండా ఉండేందుకు ACA పన్ను క్రెడిట్‌ల గడువును పొడిగించాలని డెమొక్రాట్లు పట్టుబట్టారు. రిపబ్లికన్లు చేసిన మెడికేయిడ్ కోతలను కూడా వెనక్కి తీసుకోవాలన్నారు. ఈ విషయంలో ఇరు వర్గాలు ఒక నిర్ణయానికి రాలేకపోయారు. దీంతో అమెరికా బడ్జెట్ క్లోజ్ అయిపోయింది.
అసలేమైంది..
ప్రస్తుతం అమెరికా అంతా గందరగోళంగా ఉంది. ప్రభుత్వం మూతబడడాన్ని ఇక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిపై సెనేట్ రిపబ్లికన్ నాయకుడు జాన్ థూన్ మాట్లాడుతూ.. డెమొక్రాట్ల డిమాండ్లను “వారిని బందీలుగా తీసుకునే” ప్రయత్నంగా అభివర్ణించారు. మరింత చర్చలకు వీలుగా నిధులను నవంబర్ చివర వరకు పొడిగించాలని రిపబ్లికన్లు కోరుతున్నారు. అదే సమయంలో డెమొక్రాట్లు ఆరోగ్య సంరక్షణ కోసం వందల బిలియన్ డాలర్ల నిధులను పునరుద్ధరించాలని అంటున్నారు. వీటిపై అధ్యక్షుడు ట్రంప్ తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఆయన నిర్ణయంపైనే ప్రభుత్వం మూతబడుతుందా లేదా అనేది ఆధారపడి ఉందని చెబుతున్నారు. డెమోక్రాట్ల కొన్ని డిమాండ్లకు ట్రంప్ అంగీకరిస్తే షట్ నివారించవచ్చని జాన్ థూన్ అంటున్నారు. అయితే మరోవైపు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ డెమోక్రాట్లపై విరుకుపడుతున్నారు. వారు అమెరికా ప్రజలు బెదిరిస్తున్నారని ఆరోపించారు. వాళ్లు సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో, షట్‌డౌన్ దిశగా అడుగులు పడుతున్నాయని అన్నారు.
ప్రభుత్వం షట్ డౌన్ అయితే ఏం జరుగుతుంది..
అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ బుధవారం తెల్లవారుఝామున 12.01 నుంచి అమల్లోకి రానుంది. ఇది మొత్తం అమెరికా మీదనే ఎఫెక్ట్ చూపించనుంది. దీని కారణంగా ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. పలు ఫెడరల్ ఉద్యోగ సంస్థలు మూతబడనున్నాయి. అలాగే మిరకొంత మందికి జీతాల్లో కోత విధింపబడుతుంది. వీటితో పాటూ చాలా విమాన ప్రయాణాలకు కూడా అంతరాయం కలగవచ్చని చెబుతున్నారు. ఆర్థిక నివేదికలు ఆలస్యం అవుతాయని చెబుతున్నారు. పరిశోధనలు, ప్రయోగశాలల నుంచి చిన్న వ్యాపార సంస్థల వరకూ ప్రతీది మూతబడుతుందని తెలుస్తోంది. దీనికి తోడు గత వారం వైట్ హౌస్.. ప్రభుత్వ సంస్థలను సాధారణ తాత్కాలిక సెలవుల కంటే తీవ్రమైన తొలగింపులకు సిద్ధం కావాలని ఆదేశించింది. ముఖ్యంగా ఈ ఏడాది ప్రారంభంలో ప్రభుత్వ ఉద్యోగులను పెద్ద ఎత్తున తొలగింపులు చేసింది. ఇప్పుడేమో ఇలా చెబుతోంది దీంతో ఫెడరల్ ఉద్యోగIలు దిక్కుతోచని పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
🚨 Senate Democrats just voted to send the government into a shutdown. DEMOCRAT SHUTDOWN LOADING. pic.twitter.com/t7I2x7guxZ
— The White House (@WhiteHouse) September 30, 2025
Also Read: India VS Sri lanka: తడబడి నిలబడ్డారు...శ్రీలంక మీద గెలిచిన భారత మహిళ జట్టు