India VS Sri lanka: తడబడి నిలబడ్డారు...శ్రీలంక మీద గెలిచిన భారత మహిళ జట్టు

వన్డే ప్రపంచ కప్ లో భారత మహిళ జట్టు శుభారంభం చేసింది. మొదట తడబడినా...తరువాత నిలబడి శ్రీలంక మీద 60 పరుగుల తేడాతో గెలిచింది. దీప్తి శర్మ, అమన్ జ్యోత్ లు జట్టును విజయతీరాల వైపు నడిపించారు.

New Update
india vs srilanka

ప్రస్తుతం భారత్ వేదికలపై మహిళల వరల్డ్ కప్ జరుగుతోంది. ఇందులో ఫేవరెట్ టీమ్ లలో భారత జట్టు ఒకటి. నిన్న టీమ్ ఇండియా తన మొదటి మ్యాచ్ ను శ్రీలంకతో ఆడింది. ఇందులో డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 60 పరుగుల తేడాతో గెలిచి తమ సత్తా చాటుకున్నారు మహిళా క్రికెట్ మహారాణులు. వర్షం కారణంగా మ్యాచ్ ను 47 ఓవర్లకు కుదించారు. భారత బ్యాటర్లలో అమన్ జ్యోత్ కౌర్ 56 బంతుల్లో 57 పరుగులు కొట్టగా..హర్లీన్ డియోల్ 64 బంతుల్లో 48 పరుగులు చేసి రాణించింది. దీంతో భారత్ 8 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది.

విజృంభించిన భారత స్పిన్నర్లు...

దీని తరువాత బ్యాటింగ్ కు వచ్చిన శ్రీలంక మహిళల జట్టు 45.4 ఓవర్లలో 211 పరుగులకే కుప్పకూలింది. చమరి ఆటపట్టు (43), నీలాక్షిక (35), హర్షిత (29) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. శ్రీలంక లక్ష్య చేధనకు దిగిన తరువాత వారు ఆరంభించిన తీరు చూస్తే భారత్ కు ఓటమి తప్పదేమో అనుకున్నారు. భారత పేసర్లను శ్రీలంక బ్యాటర్ చమరి అద్భుతంగా ఎదుర్కొంది. అయితే స్పిన్నర్లు వచ్చాక పరిస్థితి మొత్తం మారిపోయింది. బ్యాటింగ్ తో అదరగొట్టిన దీప్తి బౌలింగ్ లోనూ రాణించి...చమరి వికెట్ తీయండతో మ్యాచ్ ను మలుపు తిప్పింది. దాని తరువాత శ్రీలంక బ్యాటర్లు తక్కవు స్కోర్లకే అవుట్ అవడంతో విజయం భారత్ సొంతం అయింది.  బౌలింగ్ లోనూ భారత అమ్మాయిలు అదరగొట్టారు. తెలుగమ్మాయి శ్రీచరణి (2/37)తో సత్తా చాటగా..దీప్తి (3/54), స్నేహ్‌ రాణా (2/32) రాణించారు. దీప్తి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచింది. టీమ్ ఇండియా తన తరువాతి మ్యాచ్ ఉ పాకిస్తాన్ తో ఆడనుంది. ఆదివారం ఈ మ్యాచ్ జరుగుతుంది. శ్రీలంక లోని కొలంబోలో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడతాయి.

Advertisment
తాజా కథనాలు