Indian Student In US: తేడా వస్తే అంతే..భారత స్టూడెంట్స్ కు అమెరికా వార్నింగ్

భారతీయ విద్యార్థులకు అమెరికా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. చట్టాలను ఉల్లంఘిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. వీసా ఏమీ మీ హక్కు కాదని గుర్తు చేసింది. 

New Update
students

Indian Students In USA

వీసా విషయంలో అమెరికా ఎంత స్ట్రిక్ట్ గా రూల్స్ పాటిస్తుందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఏమాత్రం తేడా వచ్చినా అన్నీ క్యాన్సిల్ చేసి పడేస్తోంది. దీనికి విద్యార్థులు సైతం అతీతం కాదని అంటోంది యూఎస్ ఎంబసీ. తాజాగా భారత్‌లోని యూఎస్‌ ఎంబసీ బుధవారం ఎక్స్‌ లో ఓ ట్వీట్‌ చేసింది. అందులో అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థులకు హెచ్చరిక జారీ చేసింది.  అమెరికాలో చదువుతున్న భారత విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. యూఎస్ చట్టాలను ఉల్లంఘిస్తూ పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని అంది. వీసా అనేది హక్కు కాదని..అది విద్యార్థులకు ఒక అవకాశమని గుర్తు చేసింది. పిచ్చి పనులు చేస్తే దేశం నుంచి వెళ్ళగొట్టడమే కాదు..భవిష్యత్తులో వీసా అర్హ లేకుండా చేస్తామని చెప్పింది. 

ఇప్పటికే బోలెడు రూల్స్..

ఇప్పటికే అమెరికాలో చదువు అంటే భయపడే స్థితికి వచ్చింది. స్టూడెంట్‌ వీసా ప్రక్రియలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఫీజులను గణనీయంగా పెంచడంతో పాటు సోషల్ మీడియా తనిఖీలు తప్పనిసరిగా మారాయి. దీంతో పాటూ స్టూడెంట్స్ స్టే కు కూడా లిమిట్ పెట్టారు. ప్రస్తుతం విదేశీ విద్యార్థులు ఎఫ్ 1 వీసాలపై అమెరికాలో చదువుకోవడానికి వస్తున్నారు. ఎక్స్ఛేంజ్ విజిటర్లు జే 1 వీసాలపై వస్తున్నారు. అయితే వీరి వీసా గడువు అయిపోయాక కూడా డ్యూరేషన్ ఆఫ్ స్టే తెచ్చుకుని అమెరికాలో ఉండొచ్చు. వారు ఎంతకాలం చదవాలనుకుంటే లేదా ఇంటర్న్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొనాలనుకుంటే అంతకాలం ఉండొచ్చు. ఎక్స్ఛేంజ్‌ విజిటర్స్‌గా వచ్చే విద్యార్థులు, ప్రొఫెసర్లు, స్కాలర్లు, స్పెషలిస్ట్‌లు, ట్రైనీలు, ఇంటర్న్‌లు, ఫిజీషియన్లకు కూడా ఈ సదుపాయం వర్తిస్తుంది. ఇప్పుడు దీన్నే మార్చేసింది డిపార్ట్ మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ . ఇక మీదట ఈ వీసాలకు కొంత కాలం మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. ఈ కొత్త రూల్ భారత విద్యార్థులపై అత్యధిక ప్రభావం చూపనుంది.  ప్రస్తుతం 3.3లక్షల మందికి పైగా భారతీయులు అమెరికా వర్సిటీల్లో చదువుకుంటున్నారు. చదువు తర్వాత అమెరికాలోనే ఉండి ఉద్యోగాలు సంపాదించుకుంటారు చాలా మంది. ఇక మీదట అలా చేయడం కుదరదు.  

Advertisment
తాజా కథనాలు