Big Breaking: AP మెగా డీఎస్సీ వాయిదా..!

ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ వాయిదా పడింది. 6వ తేదీన డీఎస్సీ నోటిఫికేషన్‌ వెలువడుతుందని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. తాజా పరిణామాల నేపథ్యంలో డీఎస్సీ నోటిఫికేషన్ నేపథ్యంలో మెగా డీ ఎస్సీ నోటిఫికేషన్‌ బుధవారం రావడం లేదు.

New Update
AP : నేడు ఏపీ కొత్త టెట్‌ నోటిఫికేషన్‌.. దరఖాస్తులు ఎప్పటి నుంచి అంటే!

AP Mega DSC: ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ వాయిదా పడింది. నవంబర్‌ 6న షెడ్యూల్‌ ప్రకారం డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల కావాల్సి ఉంది. ఈ అనూహ్య పరిణామాల మధ్య నోటిఫికేషన్‌ విడుదల వాయిదా పడినట్లు సమాచారం. అసలు నవంబర్ 3వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల అవుతుందని ప్రచారం జరిగింది. అయితే అప్పటికీ ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌ విదేశీ పర్యటనలో ఉండటంతో కాస్త ఆలస్యంగా విడుదల అవుతుందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. 

Also Read: 

 నవంబర్ 4వ తేదీ సోమవారం ఆన్‌లైన్‌ టెట్‌ ఫలితాలను వెల్లడించారు. రెండ్రోజుల వ్యవధిలో 6వ తేదీన డీఎస్సీ నోటిఫికేషన్‌ వెలువడుతుందని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. తాజా పరిణామాల నేపథ్యంలో డీఎస్సీ నోటిఫికేషన్ నేపథ్యంలో మెగా డీ ఎస్సీ నోటిఫికేషన్‌ బుధవారం రావడం లేదు. ఎప్పుడు వెలువడుతుందనే దానిపై స్పష్టత కొరవడింది. 

Also Read:  అమెరికా ఎన్నికలు..ఆ రెండు రాష్ట్రాల్లో ట్రంప్‌ దే విజయం!

అదే కారణమా…

ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్ల అమలుపై ఎమ్మార్పీఎస్‌ ముందు నుంచి కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఎస్సీ వర్గీకరణ అమలు చేసే వరకు ఉద్యోగ నియామకాలు చేపట్టవద్దని ఎమ్మార్పీఎస్‌ డిమాండ్ చేస్తోంది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో వర్గీకరణ పూర్తయ్యే వరకు కొత్త నోటిఫికేషన్లు జారీ చేయవద్దని ఎమ్మార్పీఎస్‌ డిమాండ్ చేస్తోంది. మంగళవారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మందకృష్ణ భేటీ అయిన సంగతి తెలిసిందే. 

Also Read: ఓటేసిన అమెరికా...అధ్యక్ష ఎన్నికల్లో జోరుగా పోలింగ్‌!

రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన పలు అంశాలను సీఎంతో చర్చించారు. మరోవైపు డీఎస్సీ నియామకాల్లో ఎస్సీ రిజర్వేషన్ల అమలు అంశం కొలిక్కి రాకపోవడం, దీనిపై ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉండటంతోనే డీఎస్సీ నోటిఫికేషన్ ఆలస్యం అవుతున్నట్టు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యమంత్రితో భేటీలో స్పష్టత వచ్చిన తర్వాతే డీఎస్సీ నోటిఫికేషన్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. వయో పరిమితిలో సడలింపు, రిజర్వేషన్లపై క్లారిటీ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.

Also Read:  మెలానీయాతో కలిసి ఓటేసిన ట్రంప్..కాలిఫోర్నియాలో కమలా ఓటు

 

Also Read:  వీడియో విడుదల చేసిన విజయమ్మ.. కుటుంబ తగాదాలపై సంచలన ప్రకటన!

 

Advertisment
Advertisment
తాజా కథనాలు