US Elections: 9 రాష్ట్రాల్లో విజయం సొంతం చేసుకున్న ట్రంప్‌!

అమెరికా ఎన్నికల ఫలితాల్లో ట్రంప్‌ ఖాతాలో 9 రాష్ట్రాలు చేరగా, కమలా అకౌంట్‌ లో 5 రాష్ట్రాలు చేరాయి. ఇండియానా, కెంటుకీ, వెస్ట్‌ విర్జినియా, టెన్నీస్‌, ఓక్లాహోమా, మిస్సిసిపి, అలబామా, సౌత్‌ కరోలినా, ఫ్లోరిడా వంటి రాష్ట్రాల్లో ట్రంప్‌ విజయం సాధించారు.

New Update
trump

US Elections: నీదా..నాదా అని సాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల తొలి ఫలితాలు వెల్లడయ్యాయి. ఓ పక్క మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి..మరోపక్క మరికొన్ని రాష్ట్రాల్లో ఫలితాలు వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో ట్రంప్‌ ఖాతాలో 9 రాష్ట్రాలు చేరగా, కమలా అకౌంట్‌ లో 5 రాష్ట్రాలు చేరాయి.

Also Read: AP మెగా డీఎస్సీ వాయిదా..!

ట్రంప్‌ ఇండియానా, కెంటుకీ, వెస్ట్‌ విర్జినియా, టెన్నీస్‌, ఓక్లాహోమా, మిస్సిసిపి, అలబామా, సౌత్‌ కరోలినా, ఫ్లోరిడా వంటి రాష్ట్రాల్లో విజయం సాధించి ముందుకు దూసుకుపోతున్నారు. కమలా వెర్మాంట్‌, మసుచుసెట్స్‌,న్యూజెర్సీ, మెరీల్యాండ్‌, కనెక్టీకట్‌ రాష్ట్రాల్లో విజయం సాధించారు.

Also Read:  అమెరికా ఎన్నికలు..ఆ రెండు రాష్ట్రాల్లో ట్రంప్‌ దే విజయం!

అగ్రరాజ్యానికి 47 వ అధ్యక్షుడ్ని ఎన్నుకునేందుకు మంగళవారం కోట్ల మంది ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు బారులు తీరారు. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి 11 గంటల మధ్య పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది.మంగళవారం ఉదయం 7 గంటల నుంచి 11 గంటల మధ్య పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఓటింగ్‌ అర్థరాత్రి వరకూ కొనసాగుతుంది. అంటే భారత కాలమాన ప్రకారం బుధవారం ఉదయం 9 గంటలకు వరకూ జరగనున్నట్లు సమాచారం. 

Also Read:  ఓటేసిన అమెరికా...అధ్యక్ష ఎన్నికల్లో జోరుగా పోలింగ్‌!

పోటీ హోరాహోరిగా...

ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు సుమారు 16 కోట్ల మంది నమోదు చేసుకోగా వారిలో 8.2 కోట్ల మంది మంగళవారం కంటే ముందుగానే వారి ఓటు హక్కును వినియోగించుకుని ఓటేశారు.

Also Read:  మెలానీయాతో కలిసి ఓటేసిన ట్రంప్..కాలిఫోర్నియాలో కమలా ఓటు

అంటే గత ఎన్నికలలో పోలైన సగం ఓట్ల కంటే కూడా ఎక్కువే. ఈసారి అధ్యక్ష బరిలో నిలిచిన అటు రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌, డెమోక్రటిక్‌ అభ్యర్థి కమలా హారిస్‌ ఇద్దరి మధ్య కూడా పోటీ హోరాహోరిగా సాగుతుంది. దీనికి నిదర్శనంగా అతి చిన్న పోలింగ్‌ కేంద్రమైన డిక్స్‌విల్లే నాచ్ లో రిజల్ట్‌ ఏకంగా టై అయి కూర్చుంది. ఇద్దరికి కలిపి చెరో 3 ఓట్లు వచ్చాయి. 

Advertisment
Advertisment
తాజా కథనాలు