అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ మరి కొన్ని గంటల్లో జరగనుంది. ఈ క్రమంలో రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి అయిన డొనాల్డ్ ట్రంప్ ఓటర్ల కోసం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ఓటర్లంతా తమ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని ప్రజలను కోరారు. అవినీతి వ్యవస్థను ఓడించేందుకు ఇదే చివరి అవకాశమని.. ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఓటు వేయాలని సోషల్ మీడియా వేదికగా ట్రంప్ ప్రజలకు తెలిపారు.
ఇది కూడా చూడండి: నేడే అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. సర్వేలు ఏం చెబుతున్నాయంటే?
ఇది కూడా చూడండి: Rangareddy District: బాలుడి ప్రాణం తీసిన స్కూల్ గేట్..
ట్రంప్ ఓటమి కాయం
ఎన్నికల సందర్భంగా అధ్యక్షుడు జో బైడెన్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరికొన్ని గంటల్లో జరగనున్న ఎన్నికల్లో కమలా హారిస్ చేతిలో ట్రంప్ ఓటమి ఖాయమని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ట్రంప్‌ను ఓడించడానికి అయిన కూడా మీరంతా ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉండగా..అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ తలపడుతున్నారు. అయితే కొన్ని సర్వేలు ట్రంప్ గెలుస్తారని, మరికొన్ని సర్వేలు కమలా హారిస్ గెలుస్తుందని చెబుతున్నాయి.
ఇది కూడా చూడండి: ఎండతో నడిచే కారు.. ఒకసారి ఛార్జింగ్‌తో 1600KM..
ఎన్నికలకు ముందే డొనాల్డ్ ట్రంప్ స్వింగ్ స్టేట్స్‌లో ముందుంజలో ఉన్నట్లు తెలుస్తోంది. 48 శాతం మంది ట్రంప్‌కు అనుకూలంగా ఉన్నారు. అంటే కమలాహారిస్ కంటే 1.8 శాతం ఎక్కువగానే డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా ఉన్నారు. స్వింగ్ స్టేట్స్ అయిన ఆరిజోనా, జార్జియా, మిషిగన్, నెవడా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్‌లలో ట్రంప్ హవానే కొనసాగుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి.
ఇది కూడా చూడండి: Jio IPO: త్వరలో రాబోతున్న జియో ఐపీఓ.. ఎప్పుడంటే?