అమెరికా అధికారి బలుపు మాటలు.. ’పనికిరాని వాళ్ళు అమెరికా రావొద్దు'

డొనాల్డ్ ట్రంప్ H-1B వీసా విధానంలో కీలక మార్పులు తీసుకువచ్చారు. దీనికి అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లూట్నిక్ మద్దతు పలికారు. ఈ కొత్త నిబంధనలపై లూట్నిక్ మాట్లాడుతూ, అమెరికాకు అత్యంత విలువైన, ప్రతిభావంతులైన వ్యక్తులు మాత్రమే అవసరమని స్పష్టం చేశారు.

New Update
H1B

USA H1 B Visa

డొనాల్డ్ ట్రంప్ H-1B వీసా విధానంలో కీలక మార్పులు తీసుకువచ్చారు. దీనికి అమెరికా వాణిజ్య కార్యదర్శి  హోవార్డ్ లూట్నిక్ మద్దతు పలికారు. ఇటీవల ట్రంప్ ప్రభుత్వం H-1B వీసా దరఖాస్తుకు వార్షికంగా $100,000 ఫీజు విధించింది. ఈ నిర్ణయం అమెరికాలోని టెక్ పరిశ్రమపై ప్రభావం చూపుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కొత్త నిబంధనలపై లూట్నిక్ మాట్లాడుతూ, అమెరికాకు అత్యంత విలువైన, ప్రతిభావంతులైన వ్యక్తులు మాత్రమే అవసరమని స్పష్టం చేశారు.  

లూట్నిక్ ఈ వీసా విధానాన్ని "మోసం" అని అభివర్ణించారు. ఇది అమెరికన్ ఉద్యోగులకు హాని చేస్తుందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో తక్కువ వేతనాలు అందుకునే విదేశీ కార్మికులు వస్తున్నారని, ఇది అమెరికన్ కార్మికులకు నష్టం కలిగిస్తుందని ఆయన విమర్శించారు. H-1B వీసా వ్యవస్థను సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందని లూట్నిక్ పేర్కొన్నారు. గతంలో H-1B వీసా లాటరీ పద్ధతిలో కేటాయించేవారు. కానీ ఇప్పుడు ఈ అధిక ఫీజు కారణంగా, కంపెనీలు నిజంగా అవసరమైన, అత్యంత నిపుణులైన ఉద్యోగులను మాత్రమే స్పాన్సర్ చేస్తాయని ఆయన చెప్పారు.  

కొత్త విధానం ప్రకారం, ఒక కంపెనీ తన ఉద్యోగికి H-1B వీసా కావాలంటే, సంవత్సరానికి $100,000 చెల్లించాలి. ఈ భారీ రుసుము కేవలం ఉన్నత స్థాయి నైపుణ్యాలు కలిగిన ఉద్యోగుల కోసం మాత్రమే ఉంటుందని లూట్నిక్ తెలిపారు. ఇది అమెరికన్ ఉద్యోగులను కాపాడుతుందని, అదే సమయంలో అత్యున్నత ప్రతిభను మాత్రమే అమెరికాకు తీసుకువస్తుందని ఆయన వివరించారు. ఈ మార్పులు ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులకు ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే, ఈ కొత్త నిబంధనలు చట్టపరంగా నిలబడతాయా లేదా అనే దానిపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అనేక కార్మిక సంఘాలు ఈ నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నాయి.  

Advertisment
తాజా కథనాలు