Kamal Haasan : కన్నడ భాష వివాదం..  కమల్‌ హాసన్‌ సంచలన నిర్ణయం

కమల్‌ హాసన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు.  ఆయన రాజ్యసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేయడాన్ని వాయిదా వేసుకున్నారు. తన రాబోయే చిత్రం థగ్ లైఫ్ విడుదలయ్యే వరకు నామినేషన్ దాఖలును కమల్ హాసన్ వాయిదా వేసుకున్నట్లుగా సమాచారం

New Update
kamal-haasan

తమిళ నటుడు,  మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌ హాసన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు.  ఆయన రాజ్యసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేయడాన్ని వాయిదా వేసుకున్నారు. తన రాబోయే చిత్రం థగ్ లైఫ్ విడుదలయ్యే వరకు నామినేషన్ దాఖలును కమల్ హాసన్ వాయిదా వేసుకున్నట్లుగా సమాచారం.  ఇటీవల థగ్‌ లైఫ్‌ ఈవెంట్ లో తమిళ బాష నుంచే కన్నడ పుట్టిందంటూ కమల్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. దీంతో కమల్ వ్యాఖ్యలను కన్నడ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు.  

ఈ క్రమంలో  కర్ణాటకలో థగ్‌లైఫ్‌ చిత్రాన్ని నిషేధించాలని కోరుతూ ఆ రాష్ట్ర ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (కేఎఫ్‌సీసీ) హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. కమల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షమాపణ చెబితే అన్నీ పరిష్కారమయ్యేవని వ్యాఖ్యానించింది. దీంతో ఈ చిత్రాన్ని కర్ణాటకలో ప్రస్తుతానికి విడుదల చేయకూడదని కమల్‌హాసన్‌  నిర్ణయించారు. అనంతరం తన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారంటూ కేఎఫ్‌సీసీకి కమల్‌ లేఖ రాశారు.  అయితే అందులోనూ ఆయన క్షమాపణలు చెప్పకపోవడం గమనార్హం. 

Also Read :  పవన్ కల్యాణ్ గొప్ప మనసు.. రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేసిన PSPK.. కారణం అదే.. ?

Also Read :  రూ. 80 కోట్ల ఓవర్సీస్ డీల్‌తో.. రజినీకాంత్ 'కూలీ' సంచలనం

డీఎంకే, కాంగ్రెస్ కూటమికి మద్దతు

కాగా 2018లో కమల్ మక్కల్‌ నీది మయ్యం (MNM) పార్టీని స్థాపించారు. ఇది ఇండియా కూటమిలో భాగం. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్ కూటమికి మద్దతు ప్రకటించాయి. ఒప్పందంలో భాగంగా 39 లోక్‌సభ స్థానాలు, పుదుచ్చేరిలోని ఒక స్థానంలో కమల్ పార్టీ ప్రచారం చేసింది. 2025 రాజ్యసభ ఎన్నికల్లో ఎంఎన్‌ఎం పార్టీకి రాజ్యసభ స్థానం ఇచ్చేందుకు డీఎంకే నేతృత్వంలోని కూటమి అంగీకరించింది.  గత బుధవారం, మే 28న మూడు రాజ్యసభ స్థానాలకు పోటీ చేసే ముగ్గురు అభ్యర్థులలో కమల్ హాసన్ ఒకరిగా డీఎంకే అధికారికంగా ప్రకటించింది. తమిళనాడు నుండి ఆరు రాజ్యసభ స్థానాలు త్వరలో ఖాళీ అవుతున్నాయి.  వాటిని భర్తీ చేయడానికి జూన్ 19న ఎన్నికలు జరగనున్నాయి.

Also Read :  వన్ పీస్ లో బాలయ్య బ్యూటీ థై షో.. కుర్రాళ్ళ హార్ట్ బీట్ పెంచేసింది !

Also Read :  హైదరాబాద్‌లో దారుణం.. సూట్‌కేస్‌లో గుర్తు తెలియని మహిళ మృతదేహం

 

Kamal Haasan | dmk-party | Rajya Sabha nomination

Advertisment
Advertisment
తాజా కథనాలు