GAZA: ప్రాణాలు తీస్తున్న పేలని బాంబులు..పాలస్తీనీయుల కొత్త కష్టాలు

గాజాలో ప్రస్తుతం కాల్పుల విరమణ అమల్లో ఉంది.  పాలస్తీనీయులు తిరిగి తమ ప్రదేశాలకు వస్తున్నారు. తమ ఇళ్ళను, సొంతవారిని వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలో పేలని బాంబులు వారికి ప్రాణాంతంకంగా మారుతున్నాయి. 

New Update
gaza (2)

ఇజ్రాయెల్, హమాస్ రెండేళ్ళ పాటూ యుద్ధం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు బాంబులు వర్షం కురిపించుకున్నాయి. ఈ కారణంగా గాజా నగరం దాదాపు ధ్వంసమైంది. గాజాలో హమాస్ దాక్కున్నారనే కారణంతో ఇజ్రాయెల్ ఆ నగరంపై విపరీతమైన దాడులు చేసింది. వేలమంది పాలస్తీనీయులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శాంతి సూత్రాల ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్, హమాస్ ఇరు వర్గాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. కాల్పుల విరమణ చేశాయి. దీంతో గాజాను వదిలేసి వెళ్ళిపోయిన పాలస్తీనీయులు తిరిగి తమ స్వస్థలానికి తిరిగి వస్తున్నారు. వెనక్కు వచ్చాక తమ ఇళ్ళు ఉన్న చోటకు వెళ్ళి...శిథిలాల కుప్పల్లో తమవారిని వెతుక్కుంటున్నారు. 

శిథిలాల కింద పేలని బాంబులు..

అయితే ఈ వెతుకులాట ఇప్పుడు పాలస్తీనీయుల ప్రాణాలను తీస్తోంది. శిథిలాల్లో మిగిలి పోయిన పేలని బాంబులు ఇప్పుడు పేలుతూ పాలస్తీనీయుల ప్రాణాలు తీస్తున్నాయి. తమవారి కోసం వెతుకుతున్నప్పుడు బాంబులు పేలుతున్నాయి. దీంతో కొంత మంది తీవ్రగాయాలు పాలవుతుంటే.. మరి కొంత మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. రీసెంట్‌గా గాజాలో ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ.పేలని బాంబుు బొమ్మగా భావించి పట్టుకున్నారు. పట్టుకోగానే అది పేలిపోయింది. దీంతో ఆ పిల్లలిద్దూ తీవ్రగాయాలపాలయ్యారు. ఇలాంటి పేలుళ్ళ కారణంగా లాస్ట్ వీక్ ఐదుగురు పిల్లలు గాయపడ్డారని గాజా ఆరోగ్యశాఖ తెలిపింది. యుద్ధం మొదలైన దగ్గర ఇలా 52 మంది మరణించారని..మరో 267 మంది గాయడ్డారని యునైటెడ్‌ నేషన్స్‌ మైన్‌ యాక్షన్‌ సర్వీస్‌ లెక్కలు చెబుతోంది. 

కాల్పుల విరమణ తర్వాత యూఎన్ఎమ్ఎస్ కు ఇప్పటి వరకు దాదాపు 560 పేలని బాంబులు లభ్యమయ్యాయి. ఈ సంస్థ నిపుణులు మందుపాతరలు, పేలని బాంబుల వంటివాటిని తొలగించే పనులు చేపడతారు. ఇంకా చాలా ఉన్నాయని ఆ సంస్థ చెబుతోంది. మరికొన్ని దేశాల నుంచి కూడా ఇలాంట బాంబులను వెతికే నిపుణులు వస్తారని...వారు వెతికితే మరిన్ని లభ్యం అవుతాయని చెబుతున్నారు. రెండేళ్ల యుద్ధంలో ఇజ్రాయెల్‌ దాడుల కారణంగా గాజావ్యాప్తంగా 60 మిలియన్‌ టన్నుల మేర శిథిలాలు పేరుకుపోయినట్లు తెలుస్తోంది. 

Also Read: Delhi: గొంతునొప్పి, ఆస్త్మాలతో బాధపడుతున్న ఢిల్లీ వాసులు..ప్రమాదకర స్థాయిలో ఎయిర్ పొల్యూషన్

Advertisment
తాజా కథనాలు