/rtv/media/media_files/2025/09/21/trump-warning-2025-09-21-09-20-45.jpg)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అఫ్గానిస్తాన్ గట్టి హెచ్చరికలు చేశారు. బగ్రామ్ ఎయిర్ బేస్ ను తిరిగి ఇవ్వకపోతే కఠిన చర్యలు తప్పవని బెదిరించారు. దీనికి సంబంధించి తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. బగ్రామ్ ఎయిర్ బేస్ ను నిర్మించిన వారికే అంటే...అమెరికాకే తిరిగి ఇచ్చేయాలని ట్రంప్ డిమాండ్ చేశారు. అలా చేయకపోతే తాను చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంటానని హెచ్చరించారు.
మాట్లాడతా...వినకపోతే అంతే..
ఆప్గానిస్తాన్ తో చర్చలు జరుపుతామని...ఎయిర్ బేస్ గురించి మాట్లాడతామని చెప్పారు. దాన్ని తిరిగి తీసుకుంటామని...వారు అడ్డుకుంటే తాను ఏం చేస్తానో ఎవరో ఊహించలేరని ట్రంప్ హెచ్చరించారు. అయితే ఎంత తొందరలో చర్యలు తీసుకుంటారో మాత్రం చెప్పలేదు. అలానే అమెరికా దళాలను ఆప్గానిస్తాన్ కు పంపిస్తారా లేదా అనే దానికి మాత్రం సమాధానం ట్రంప్ చెప్పలేదు.
చైనా అణు క్షిపణులు తయారు చేసే ప్రదేశానికి సమీపంలో ఉన్న అత్యంత వ్యూహాత్మకమైన బగ్రామ్ ఎయిర్ బేస్ ను తిరిగి స్వాధీనం చేసుకోవాలని అనుకుంటున్నట్లు ఇటీవల ట్రంప్ ప్రకటించారు. చైనా నుంచి కేవలం వ్యవధిలోనే ఆఫ్గానిస్తాకు వెళ్ళి రావొచ్చని ట్రంప్ చెప్పారు. మరోవైపు ఈ విషయంపై ఆఫ్ఘాన్ ప్రజలే నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచడం వల్ల మద్దతు లభించదని ఆ దేశ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ అన్నారు. అలాగే ఆఫ్గాన్ కూడా యూఎష్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపింది.
Also Read: H1-B Visa: సడెన్ గా హెచ్ 1-బీ వీసాల ఫీజు పెంపు ఎందుకు? భారత్, చైనాల పై ఒత్తిడి కోసమేనా?