/rtv/media/media_files/2026/01/28/trump-2026-01-28-20-08-40.jpg)
Trump
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌పై దూకుడు ప్రదర్శిస్తున్నారు. తాజాగా మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. మరిన్ని యుద్ధనౌకలు ఆ దేశం వైపు వెళ్తున్నాయని పేర్కొన్నారు. వీటిని ఉపయోగించే అవసరం రావొద్దని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పటికే అమెరికాకు చెందిన విమాన వాహకనౌక 'USS అబ్రహం లింకన్' పశ్చిమాసియాకు చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ యుద్ధ నౌకల గురించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఉద్రిక్త పరిస్థితులను మరింత పెంచేశాయి.
Also Read: ప్రాణాలు తీసిన రెండు తప్పులు..అజిత్ పవార్ ఫ్లైట్ యాక్సిడెంట్ లో నిజాలు
మరో యుద్ధనౌక ఇరాన్‌వైపు వెళ్తోందని.. వారు ఒప్పందం చేసుకుంటారని ఆశిస్తున్నామని ట్రంప్ అన్నారు. ఇప్పటికే వాళ్లు దాన్ని చేసుకోవాల్సి ఉందని.. దీనికి వారు సిద్ధంగా ఉన్నట్లు నాకు తెలుసని అన్నారు. వాళ్లు చాలాసార్లు తనకు ఫోన్ చేసినట్లు చెప్పారు. అదనపు వైమానిక రక్షణ వ్యవస్థలను కూడా ఈ ప్రాంతం వైపు తరలిస్తున్నట్లు మరో అమెరికా అధికారి చెప్పారు.
Also Read: తండ్రి లాంటి శరద్ పవర్‌పై అజిత్ తిరుగుబాటు.. కారణమేంటో తెలుసా?
ఇదిలాఉండగా ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వేలాది మంది ఈ ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమాయక ప్రజల ప్రాణాలు తీస్తే సహించేది లేదంటూ హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే అబ్రహం లింకన్ వాహక నౌకతో పాటు మరికొన్ని యుద్ధ నౌకలను పశ్చిమాసియా మోహరిస్తున్నారు. ఇరాన్‌పై అమెరికా ఏ క్షణమైన దాడులు చేయవచ్చనే ఆందోళనలు నెలకొన్నాయి.
Follow Us