ట్రంప్ సంచలనం.. రష్యాతో యుద్ధానికి 2 న్యూక్లియర్ సబ్ మైరెన్లు!

అమెరికా అధ్యక్షుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆయన చర్యలతో రష్యా, అమెరికా మధ్య యుద్ధం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నారు. రష్యాకు దగ్గరల్లో సముద్రంలో 2 అమెరికా న్యూక్లియర్ సబ్ మైరెన్లు మోహరించాడు ట్రంప్.

New Update
Trump

Trump

అమెరికా అధ్యక్షుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమ దేశాల భద్రతను బలోపేతం చేయడానికి అమెరికా న్యూక్లియర్ సబ్‌ మెరైన్లను రష్యా సమీపంలో మోహరించాలని ఆదేశించాడు. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ ద్వారా వెల్లడించారు. ఇది అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది. ఉక్రెయిన్‌పై రష్యా దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో, ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. రష్యాకు అమెరికా శక్తి, సామర్థ్యాన్ని చూపించేందుకే ఇలా ట్రంప్ ఇలా చేశాడని కొందరు భావిస్తున్నారు. 

దీనిపై రష్యా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత భద్రతా మండలి ఉపాధ్యక్షుడు మెద్వదేవ్ స్పందించారు. ట్రంప్ చర్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. రష్యా ఎటువంటి పరిస్థితుల్లోనూ తమ విధానాన్ని మార్చుకోదని స్పష్టం చేశారు. సోవియట్ కాలం నుంచి రష్యా అణ్వాయుధాలను కలిగి ఉందని, వాటి సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయవద్దని హెచ్చరించారు. 

రెచ్చగొట్టే వ్యాఖ్యల వెనుక ఏదైనా ఉద్దేశాలు ఉంటే మేము దాడికి సిద్ధమని ట్రంప్ అన్నారు. మాటలు చాలా ముఖ్యం.. వాటివల్ల తప్పులు జరుగుతాయని రష్యాకు వార్నింగ్ ఇచ్చాడు. ఉక్రెయిన్ విషయంలో 10 రోజుల్లో కాల్పలు విరమణకు రావాలని రష్యాని ట్రంప్ హెచ్చరించాడు. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం నాటో కూటమి దేశాలకు భరోసా ఇస్తుందని కొందరు భావిస్తున్నారు. అయితే, ఇది రష్యాను మరింత రెచ్చగొట్టే చర్యగా మరికొందరు విమర్శిస్తున్నారు. అంతర్జాతీయ సంబంధాల నిపుణులు ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు