Trump: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. ట్రంప్ కీలక ప్రకటన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో చర్చలు జరిపానని తెలిపారు. ఉక్రెయిన్ సైన్యం ప్రస్తుతం ఆపదలో ఉందని చెప్పిన ట్రంప్.. వాళ్ల ప్రాణాలను కాపాడాలని పుతిన్‌ను కోరినట్లు చెప్పారు.

New Update
Donald Trump

Donald Trump

మూడేళ్ల క్రితం మొదలైన రష్యా ఉక్రెయిన్‌ యుద్ధం ఇంకా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో చర్చలు జరిపానని తెలిపారు. అలి సఫలమైనట్లు పేర్కొన్నారు. అలాగే ఉక్రెయిన్ సైన్యం ప్రస్తుతం ఆపదలో ఉందని చెప్పిన ట్రంప్.. వాళ్ల ప్రాణాలను కాపాడాలని పుతిన్‌ను కోరినట్లు చెప్పారు.    

Also Read: తమిళనాడులోనూ లిక్కర్ స్కామ్.. మొత్తం వేయి కోట్లు.. షాకింగ్ విషయాలు!

'' రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చలు జరిపాను. రక్తపాతం సృష్టిస్తున్న ఈ యుద్ధం ఎట్టకేలకు ముగిసే ఛాన్స్ ఉంది. కానీ ఇలాంటి సమయంలోనే వేలాది మంది ఉక్రెయిన్‌ బలగాలను రష్యా సైన్యం చుట్టుముట్టింది. ప్రస్తుతం ఉక్రెయిన్ సైన్యం ఆపదలో ఉంది. వాళ్ల ప్రాణాలు కాపాడాలని పుతిన్‌ను గట్టిగా అభ్యర్థించాను. లేకపోతే ఇది రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ఎవరూ చూడని భయంకరమైన ఊచకోతగా మారే ఛాన్స్ ఉంది. వాళ్లకి భగవంతుడు అండగా ఉండాలని ఆశిస్తున్నానని'' డొనాల్డ్ ట్రంప్ తన సొంత సామాజిక మాధ్య వేదికగా అయిన ట్రూత్‌ సోషల్‌లో తెలిపారు. 

Also Read: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో హోలికా దహన్‌ ..లక్షలాది కొబ్బరికాయలతో...

మరోవైపు అమెరికా ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందంపై పుతిన్‌ కూడా స్పందించారు. ఈ అంశానికి స్పందిస్తూ అనుకూలంగా మాట్లాడారు. ఈ కాల్పుల విరమణ అనేది శాశ్వత శాంతికి దారితీయాలని అన్నారు. సంఘర్షణలకు మూల కారణాలను పరిష్కరించాలని తెలిపారు. అయితే పుతిన్ ఇలా స్పందించిన కొన్ని గంటల తర్వాత ట్రంప్‌తో సంభాషించారు.       

Also Read: పరాయి పురుషులతో శృంగారం ముచ్చట్లు.. ఆ కేసులో భార్యలకు షాక్ ఇచ్చిన హైకోర్టు!

Also Read: ఆ వయస్సులోనే కన్యత్వాన్ని కోల్పోతున్న భారతీయ మహిళలు

Advertisment
తాజా కథనాలు