Donald Trump: తగ్గేదేలే :  ట్రంప్ రివర్స్ ఎటాక్.. సుంకాలు 15 శాతానికి పెంపు!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. విదేశాల నుండి వచ్చే వస్తువులపై దిగుమతి పన్నును ఏకంగా 15 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు.

New Update
Donald Trump

Donald Trump

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. విదేశాల నుండి వచ్చే వస్తువులపై దిగుమతి పన్నును ఏకంగా 15 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. నిజానికి, అంతకుముందు రోజు ఆయన 10 శాతం పన్ను విధిస్తానని చెప్పారు. అయితే, ట్రంప్ గతంలో విధించిన పన్నులను సుప్రీం కోర్టు కొట్టివేయడంతో, దానికి సమాధానంగా ఆయన ఈసారి మరింత పన్ను పెంచుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Also Read: ఆరు రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్‌ పూర్తి..ఆ రాష్ట్రంలో ఏకంగా 68 లక్షల ఓటర్ల తొలగింపు

పన్నులు విధించే అధికారం కేవలం కాంగ్రెస్ (అక్కడి పార్లమెంట్)కు మాత్రమే ఉంటుందని, అధ్యక్షుడు స్వయంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేరని సుప్రీం కోర్టు 6-3 మెజారిటీతో తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. ఇది అమెరికా వ్యతిరేక నిర్ణయమని, చాలా చెత్తగా ఉందని ఆయన విమర్శించారు. తన పవర్స్‌ను కోర్టు అడ్డుకున్నప్పటికీ, వేరే చట్టాలను అడ్డం పెట్టుకుని తన పట్టును నిరూపించుకోవాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారు.

తనకు వ్యతిరేకంగా తీర్పునిచ్చిన జడ్జీలపై ట్రంప్ వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు. తన హయాంలో నియమించిన జడ్జీలే తనకు వ్యతిరేకంగా ఓటు వేయడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. అయితే, తనకు మద్దతుగా నిలిచిన జడ్జి బ్రెట్ కావనాను మాత్రం ఆయన ఆకాశానికెత్తారు. విదేశీ వస్తువులపై పన్నులు వేయడం ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థను బాగు చేయవచ్చని, తయారీ రంగాన్ని పెంచవచ్చని ట్రంప్ బలంగా నమ్ముతున్నారు.

Also Read: ఓరెయ్ కామాంధుడా..బెదిరించి అత్యాచారం.. ప్రెగ్నెంట్ చేసి కూడా వదల్లేదు!

 సామాన్య ప్రజల జేబులకు చిల్లు

ట్రంప్ నిర్ణయంపై డెమోక్రాట్లు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. పన్నులు పెంచడం వల్ల సామాన్య ప్రజల జేబులకు చిల్లు పడుతుందని, వస్తువుల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బంది పడతారని వారు హెచ్చరిస్తున్నారు. ట్రంప్ తీరు ప్రజలను దోచుకున్నట్లుగా ఉందని వారు విమర్శిస్తున్నారు. ఇప్పటికే దిగుమతి పన్నుల ద్వారా అమెరికా ప్రభుత్వం 133 బిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు పెంచిన పన్నులు ఎన్ని రోజులు అమల్లో ఉంటాయనేది ఉత్కంఠగా మారింది.

Also Read: తొలి సూపర్-8 మ్యాచ్‌ రద్దు.. కివీస్-పాక్‌కు చెరో పాయింట్

గతంలో రష్యా నుండి చమురు కొనుగోలు వ్యవహారంలో భారత్‌పై ఉన్న 25% సుంకాలను అమెరికా 18 శాతానికి తగ్గించింది. అయితే, తాజా ఉత్తర్వుల ప్రకారం ప్రపంచ దేశాలన్నిటికీ 15% పన్ను వర్తిస్తుండటంతో, భారత్‌కు కూడా ఈ 15% పన్ను భారం తప్పదు.

Advertisment
తాజా కథనాలు