ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం చిన్న పిల్లల కొట్లాటల ఉంది: ట్రంప్

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ భీకర దాడులు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు మరింత చెలరేగాయి. దీంతో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్.. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం చిన్న పిల్లల కొట్లాటల ఉందన్నారు. ఈ యుద్ధ ప్రక్రియను ముగించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

Trump
New Update

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తున్న వేళ.. మంగళవారం రాత్రి ఇరాన్‌ ఇజ్రాయెల్‌పై బాంబుల వర్షం కురిపించింది. దాదాపు 200 క్షిపణులతో ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది. దీంతో యుద్ధ వాతావరణ పరిస్థితులు మరింత ముదిరాయి. ఈ నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఈ దాడులపై స్పందించారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం చిన్న పిల్లల కొట్లాటల ఉందని వ్యాఖ్యానించారు. మిడిల్ ఈస్ట్‌లో జరిగే ఇలాంటి సంఘటనలపై అమెరికా మరింత లోతుగా జోక్యం చేసుకుంటుందని పేర్కొన్నారు.

Also Read: భారీగా డ్రగ్స్‌ పట్టివేత.. దాని విలువ ఎంతో తెలిస్తే మతిపోతుంది

'' ఈ యుద్ధ ప్రక్రియను ముగించాలి. ఇద్దరు చిన్నపిల్లలు పాఠశాల ప్రాంగణంలో కొట్లాడుకుంటున్నట్లు ఉంది. ఆ ప్రాంతాల్లో ఏం జరుగుతుందో మేము గమనిస్తున్నాం. ఇది భయంకరమైన యుద్ధం. ప్రతిఒక్కరూ జీవించాలి. ఈ అంశంపై అమెరికా మరింత దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. చాలా కాలంగా నేను ముడో ప్రపంచ యుద్ధం గురించి ప్రస్తావిస్తూనే ఉన్నాను. నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మిడిల్ ఈస్ట్‌లో ఎలాంటి యుద్ధాలు జరగలేదు. ప్రస్తుత అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు అసమర్థులు. వాళ్లే యుద్ధాన్ని ప్రోత్సహిస్తూ ఆర్థిక సాయం చేస్తున్నారు. ఈ ఘర్షణలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేలా ఉన్నాయని'' డొనాల్డ్ ట్రంప్ అన్నారు.  

#donald-trump #trump #iran-israel-war #iran-israel
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe