భారీగా డ్రగ్స్‌ పట్టివేత.. దాని విలువ ఎంతో తెలిస్తే మతిపోతుంది

ఢిల్లీ పోలీసులు భారీగా డ్రగ్స్‌ను పట్టుకున్నారు. దాదాపు రూ.2 వేల కోట్ల ధర గల డ్రగ్స్‌ను ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం స్వాధీనం చేసుకుంది. ఈ డ్రగ్స్‌ను రవాణా చేస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

New Update
Drugs

ఈ మధ్య కాలంలో డ్రగ్స్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఎక్కువగా యువత ఈ డ్రగ్స్ బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఆ మత్తులో ఎన్నో సమస్యల సృష్టిస్తున్నారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీలో భాగంగా పట్టుబడ్డ వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయినా ఎక్కడా ఆగడం లేదు.

ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ఇలాంటి వ్యవహారం ఎక్కువైపోయింది. ఇటీవలే ఢిల్లీలోని తిలక్ నగర్ ప్రాంతంలో 400 గ్రాముల హెరాయిన్, 160 గ్రాముల కొకైన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఇద్దరు ఆఫ్ఘన్ జాతీయులు హషిమి మహ్మద్‌ వారిస్‌, అబ్దుల్‌ నయీబ్‌లను అరెస్టు చేశారు. ఇక ఇది మరువక ముందే మరో అతిపెద్ద బండారం బయటపడింది.

ఇది కూడా చదవండి: ఏకంగా సుప్రీంకోర్టు సెట్ వేసి.. ఇలాంటి సైబర్ నేరం నెవ్వర్ బిఫోర్!

ఢిల్లీ పోలీసులు సౌత్ ఢిల్లీలో జరిపిన దాడిలో దాదాపు ఊహకందని కొకైన్ పట్టుబడింది. ఇది రాజధాని చరిత్రలో అతిపెద్ద డ్రగ్స్ బస్ట్‌లలో ఒకటిగా చెప్పబడింది. మరి ఎంతమేర పట్టుబడింది. దాని విలువ ఎంత అనే విషయానికోస్తే.. స్పెషల్ సెల్ నిర్వహించిన ఆపరేషన్‌లో భారీగా డ్రగ్స్‌ను పట్టుకున్నారు. దాదాపు రూ.2 వేల కోట్ల ధర గల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఢిల్లీ పోలీసులు మాట్లాడుతూ.. స్పెషల్ సెల్ 565 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 

ఈ డ్రగ్స్‌ను రవాణా చేస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కొకైన్ దాదాపు రూ.2,000 కోట్లుగా అంచా వేశారు. ఆపై అరెస్టు చేసిన వ్యక్తులను పోలీసులు విచారిస్తున్నారు. ఎవరి కోసం ఈ డ్రగ్స్ రాజధానికి తీసుకెళ్లారు.. ఎవరికి డెలివరీ చేయాలనుకుంటున్నారు.. ఇందులో ఇంకా ఎంతమంది ఉన్నారు అని వారిని ప్రశ్నిస్తు్న్నారు. అయితే దీని వెనుక అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ సిండికేట్ హస్తం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న కొకైన్‌ను రీజియన్‌లోని హై-ప్రొఫైల్ పార్టీలలో ఉపయోగించేందుకు ఉద్దేశించినవిగా అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ఇప్పటివరకు రాజధానిలో జరిగిన అతి పెద్ద డ్రగ్స్ రికవరీ ఇదేనని పోలీసులు తెలిపారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు