/rtv/media/media_files/2026/03/08/uranium-2026-03-08-16-36-50.jpg)
ఇరాన్‌పై ట్రంప్ ఇజ్రాయెల్‌తో దాడి చేయించడానికి ప్రధాన కారణం అక్కడున్న యురేనియం నిల్వలు. ఖమేనీ పాలన, ఇరాన్ న్యూక్లియర్ ప్రొగ్రామ్ పేరుతో పశ్చిమాసియాలో ట్రంప్ యుద్ధం స్టార్ట్ చేశాడు. ఈక్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ వద్ద ఉన్న సుమారు 450 కిలోల అత్యంత శుద్ధి చేసిన యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా మాస్టర్ ప్లాన్ వేసింది. దీని కోసం స్పెషల్‌గా గ్రౌండ్ ట్రూప్స్‌ను తయారు చేశాడు ట్రంప్. ఈ స్పెషల్ ఆర్మీ ఇరాన్ యురేనియం నిల్వలను అణ్వాయుధాల తయారీకి ఉపయోగించకుండా అడ్డుకోవడమే దీని ప్రధాన లక్ష్యం.
గత ఏడాది ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు చేసినప్పటికీ, యురేనియం నిల్వలు ఇంకా భద్రంగా ఉన్నాయని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఎస్ఫహాన్, ఫోర్డో వంటి భూగర్భ కేంద్రాల్లో ఈ నిల్వలు ఉన్నట్లు సమాచారం. ఇరాన్ వీటిని ఎప్పుడైనా బయటకుతీసి బాంబు తయారీకి వాడే ప్రమాదం ఉందని అమెరికా ఆందోళన చెందుతోంది.
ఆపరేషన్ ఎలా సాగుతుంది?
ఈ మిషన్ చాలా క్లిష్టమైనది, అమెరికా దీన్ని అత్యంత రహస్యంగా చేపడుతుంది. మొదట ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయాలి. ప్రస్తుతం కొనసాగుతున్న దాడుల ద్వారా అమెరికా ఇప్పటికే ఇరాన్ గగనతలంపై పట్టు సాధించింది. నేవీ సీల్స్ లేదా డెల్టా ఫోర్స్ వంటి అత్యున్నత స్థాయి కమాండోలను హెలికాప్టర్ల ద్వారా స్టోరేజ్ ప్రాంతాలకు పంపిస్తారు.
రెండు రకాల ప్లాన్స్
నిల్వల తరలింపు: యురేనియం నిల్వలను ఇరాన్ నుండి పూర్తిగా బయటకు తరలించడం.
స్థానిక నిర్వీర్యం: అణు నిపుణులు అక్కడికక్కడే యురేనియంను డైల్యూట్ చేసి, దానిని న్యూక్లియర్ వెపన్స్ తయారీకి పనికిరాకుండా చేయడం.
అగ్రదేశం ముందున్న సవాళ్లు
ఇరాన్ తన అణు నిల్వలను పర్వతాల లోపల, వందల అడుగుల లోతులో భద్రపరిచింది. అక్కడికి చేరుకోవడం ప్రాణాలతో చెలగాటమే. ఒకవేళ ఈ మిషన్ విఫలమైతే, అది మరింత పెద్ద యుద్ధానికి దారితీస్తుంది. అయినప్పటికీ, "ఇరాన్ ఇకపై అణు బెదిరింపులకు పాల్పడకూడదు" అనే పట్టుదలతో అమెరికా ఈ సాహసోపేతమైన అడుగు వేయాలని భావిస్తోంది.
Follow Us