/rtv/media/media_files/2025/06/24/trump-issues-warning-for-israel-after-ceasefire-violations-2025-06-24-17-13-41.jpg)
Trump issues warning for Israel after ceasefire violations
ఇజ్రాయెల్, ఇరాన్ కాల్పుల విరమణకు అంగీకరించిన రెండు గంటలకే దీనికి బ్రేక్ పడింది. ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి తమపై దాడులు చేసిందని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఈ దాడులకు తాము కూడా గట్టిగా బదులిస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడులు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఈ వ్యవహారంపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్‌పై బాంబు దాడులు చేయకూడదని ఇజ్రాయెల్‌ను హెచ్చరించారు.
Also Read: అంతరిక్షంలోకి 23 ఏళ్ల తెలుగు యువతి జాహ్నవి..!
'' ఇరాన్ ఇప్పటికీ శాంతికి కట్టుబడి ఉందని నమ్ముతున్నాను. వాళ్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ కూడా సీజ్‌ఫైర్ బ్రేక్ చేసింది. ఒక రాకెట్‌ను ప్రయోగించారు, కానీ అది లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. ఒప్పందం కుదిరాక కూడా ఎప్పుడూ చూడని విధంగా బాంబులు ప్రయోగించారు. ఇది సంయమనం పాటించాల్సిన సమయం. ఇజ్రాయెల్ పట్ల నాకు సంతోషం లేదు. ఇరాన్‌తో కూడా లేదని'' ట్రంప్ అన్నారు.
#WATCH | US President Donald Trump says "I am not happy that Israel is going out now. There was one rocket that I guess was fired overboard, and it missed its target. Now Israel is going out. These guys gotta calm down. Ridiculous. I didn't like the fact that Israel unloaded… https://t.co/vpJ8ELL9SF pic.twitter.com/DpAjHTK8XK
— ANI (@ANI) June 24, 2025