/rtv/media/media_files/2026/01/31/donald-trump-2026-01-31-11-02-18.jpg)
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్‌స్టీన్(Jeffrey Epstein) కేసులో మరో విస్తుపోయే నిజం వెలుగులోకి వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ చేతిలో కాంప్రమైజ్ అయ్యారని, అగ్రరాజ్య అధ్యక్షుడిపై ఇజ్రాయెల్ తన పట్టును బిగించిందని ఒక విశ్వసనీయ ఎఫ్‌బీఐ మూలం ఆరోపించినట్లు తాజాగా విడుదలైన పత్రాలు పేర్కొంటున్నాయి.
Also Read : పుతిన్ సంచలన నిర్ణయం.. ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ
వెనుక ట్రంప్ అల్లుడు కీలక పాత్ర
ఎఫ్‌బీఐ(fbi) నివేదికలో వెల్లడించిన వివరాల ప్రకారం.. డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఇజ్రాయెల్(israel) ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారని, దీని వెనుక ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ కీలక పాత్ర పోషిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ట్రంప్ సంస్థలోనూ, అధ్యక్ష బాధ్యతల్లోనూ కుష్నర్ పరిమితికి మించిన ప్రభావాన్ని చూపిస్తున్నారని ఎఫ్బీఐ ఇన్ఫార్మర్ పేర్కొన్నారు.
జారెడ్ కుష్నర్ కుటుంబానికి రష్యా నుండి అక్రమంగా డబ్బులు వస్తున్నాయని, వారు అతివాద జూయిష్ నెట్‌వర్క్ అయిన చబాద్ తో సంబంధాలు కలిగి ఉన్నారని నివేదిక పేర్కొంది. కుష్నర్ తన రియల్ ఎస్టేట్ ప్లాట్‌ఫారమ్ కాడ్రే ద్వారా రష్యా ప్రభుత్వ సంస్థల నుండి వచ్చిన పెట్టుబడులను సరిగ్గా వెల్లడించలేదని, ఆ నిధులను ఇతర ప్రాజెక్టులకు మళ్లించారని ఆరోపణలు వచ్చాయి.
కుష్నర్ తండ్రి గతంలో ఆర్థిక నేరాల్లో జైలు శిక్ష అనుభవించగా, ట్రంప్ తన అధికారంతో ఆయనకు క్షమాభిక్ష పెట్టడంపై కూడా నివేదిక ప్రస్తావించింది. ట్రంప్ గతంలో బెవర్లీ హిల్స్ మాన్షన్‌ను 41 మిలియన్ డాలర్లకు కొని, తర్వాత విదేశీ సంబంధాలున్న ఒక షెల్ కంపెనీకి 95 మిలియన్ డాలర్లకు అమ్మడాన్ని ఎఫ్బీఐ నివేదిక అనుమానాస్పదంగా పేర్కొంది. ఈ డీల్‌లో విదేశీ నిధులు మళ్లాయనే సంకేతాలు ఉన్నాయని నివేదిక హెచ్చరించింది.
ఎప్స్టీన్ తరఫు న్యాయవాది అలెన్ డెర్షోవిట్జ్‌ను ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొసాద్ తన ఆధీనంలోకి తీసుకుందని నివేదిక పేర్కొంది. ఉన్నత విద్యాలయాల్లోని సంపన్న మరియు రాజకీయంగా బలమైన విద్యార్థులను ఇజ్రాయెల్ గూఢచారి వ్యవస్థలోకి తీసుకురావడానికి ఆయన తన ప్రభావాన్ని ఉపయోగించారని ఎఫ్బీఐ ఇన్ఫార్మర్ ఆరోపించారు.
కేవలం డెర్షోవిట్జ్ మాత్రమే కాకుండా, స్వయంగా జెఫ్రీ ఎప్స్టీన్ కూడా గ్లోబల్ పొలిటికల్ మరియు ఫైనాన్షియల్ నెట్‌వర్క్‌లను ప్రభావితం చేయడానికి ఒక పావులా ఉపయోగపడ్డారని నివేదికలో పేర్కొన్నారు.
Also Read : అమెరికా-ఇరాన్ మధ్య కమ్మకుంటున్న యుద్ధమేఘాలు.. అంతం చేస్తామనంటూ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
Follow Us