భారతీయులకు ట్రంప్ బిగ్ షాక్.. దాని కోసం రూ.లక్ష డాలర్లు కట్టాల్సిందే

డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వీసాల జారీలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్1బీ వీసా దరఖాస్తు ఫీజు లక్ష డాలర్‌లకు(రూ.83 లక్షలు) పెంచింది. . ట్రంప్ ఈ నిర్ణయం అమెరికాలోని టెక్నాలజీ రంగం, ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులకు తీవ్ర ప్రభావం చూపవచ్చు.

New Update
H1B and Green Card visa rules

డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వీసాల జారీలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్1బీ వీసా దరఖాస్తు ఫీజు $100,000(లక్ష డాలర్‌లకు పెంచింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.83 లక్షలు. ట్రంప్ ఈ నిర్ణయం అమెరికాలోని టెక్నాలజీ రంగం, ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులకు తీవ్ర ప్రభావం చూపవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికన్లకు ఉద్యోగ అవకాశాలను పెంచడమే ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశమని వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. ఉద్యోగాలు, ఉన్నత విద్యా కోసం  అమెరికాకు వెళ్లే వారి సంఖ్య భారతీయులదే అధికంగా ఉంటుంది. ఈ మొత్తం వీసా ఫీజు కంపెనీలు పెంటుకోకపోతే దరఖాస్తు దారులే భరించాల్సి ఉంటుంది. 

ప్రస్తుతం, హెచ్1బీ వీసా దరఖాస్తు ప్రక్రియకు కొన్ని వందల డాలర్లు మాత్రమే ఖర్చు అవుతుంది. కానీ, ట్రంప్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త నిబంధన ప్రకారం, ప్రతి హెచ్1బీ వీసా దరఖాస్తుకు $100,000 (సుమారు 83 లక్షల రూపాయలు) చెల్లించాల్సి ఉంటుంది. ఈ భారీ ఫీజు కంపెనీలపై ఆర్థిక భారాన్ని విపరీతంగా పెంచుతుంది. దీంతో చిన్న, మధ్యస్థాయి కంపెనీలు విదేశీ ఉద్యోగులను నియమించుకోవడం దాదాపు అసాధ్యం కావచ్చు.

1990లో నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల కోసం హెచ్-1బీ వీసా తీసుకొచ్చారు. యూఎస్‌లోని టెక్ కంపెనీలు విదేశీ నిపుణుల కోసం ఇవి జారీ చేస్తాయి. హెచ్‌-1బీ వీసా దారుల్లో ఇండియా 71 శాతం వాటా కలిగి ఉండగా, చైనా 11.7 శాతం వాటా కలిగి ఉంది. వీటిని మూడు నుంచి ఆరేళ్ల మధ్య కాలానికి మంజూరు చేస్తారు. అమెరికా ఏటా 85వేల వీసాలను లాటరీ విధానం ద్వారా జారీ చేస్తోంది. లక్కీ డ్రా పద్దతి ద్వారా వారిని ఎంపిక చేస్తారు.

ట్రంప్ ప్రభుత్వం ఈ మార్పులు తీసుకొచ్చిన ప్రధాన కారణం హెచ్1బీ వీసా దుర్వినియోగాన్ని అరికట్టడమే అని చెబుతోంది. కొంతమంది కంపెనీలు తక్కువ జీతాలకు విదేశీ ఉద్యోగులను నియమించుకోవడం ద్వారా అమెరికన్ ఉద్యోగుల వేతనాలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ కొత్త ఫీజు వల్ల, కంపెనీలు అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులను మాత్రమే నియమించుకోవడానికి ప్రేరేపించబడతాయని, తద్వారా అమెరికన్ ఉద్యోగులకు నష్టం జరగదని వైట్‌హౌస్ వర్గాలు భావిస్తున్నాయి.
అయితే, ఈ నిర్ణయంపై టెక్ దిగ్గజాలు, నిపుణుల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థకు, సాంకేతిక ఆవిష్కరణలకు హెచ్1బీ వీసా ప్రోగ్రామ్ చాలా కీలకమని, ఈ మార్పులు దేశీయ ఆవిష్కరణలను అడ్డుకోవచ్చని కొందరు హెచ్చరిస్తున్నారు. భారీ ఫీజుల కారణంగా చాలా కంపెనీలు తమ కార్యకలాపాలను ఇతర దేశాలకు మార్చుకునే అవకాశం ఉందని కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయం చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉందని కూడా నిపుణులు చెబుతున్నారు. ఈ పరిణామాలు భారతీయ ఐటీ నిపుణులకు, అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు ఆందోళన కలిగించే అంశాలు.

Advertisment
తాజా కథనాలు